మూడో వన్డేలో సఫారీలకి చుక్కలు చూపిస్తున్న బౌలర్లు... 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా...

Published : Oct 11, 2022, 03:39 PM ISTUpdated : Oct 11, 2022, 03:46 PM IST
మూడో వన్డేలో సఫారీలకి చుక్కలు చూపిస్తున్న బౌలర్లు... 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా...

సారాంశం

43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సౌతాఫ్రికా... మహ్మద్ సిరాజ్‌, వాషింగ్టన్ సుందర్‌లకి రెండేసి వికెట్లు...

వన్డే సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు భారత బౌలర్లు. దీంతో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా...

స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌తో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ వేయించాడు కెప్టెన్ శిఖర్ ధావన్. 10 బంతుల్లో  ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని అవుట్ చేసిన సుందర్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన జాన్నేమన్ మలాన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ రెండు క్యాచ్‌లను ఆవేశ్ ఖాన్ అందుకోవడం విశేషం...

25 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రీజా హెన్రిక్స్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసిన హెన్రిక్స్ కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, షాబజ్ అహ్మద్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...

మహ్మద్ సిరాజ్‌కి 2 వికెట్లు దక్కగా వాషింగ్టన్ సుందర్, రెండో వన్డే ఆడుతున్న షాబజ్ అహ్మద్ తలా ఓ వికెట్ తీశారు. షాబజ్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో 10 పరుగులు రావడం విశేషం. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 66 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా.

19 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది సౌతాఫ్రికా.  మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్..  చక్కని బౌలింగ్‌తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ సఫారీ బ్యాటర్లును ఇబ్బంది పెడుతున్నారు. ఆవేశ్ ఖాన్ తన తొలి 5 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 8 పరుగులు మాత్రమే ఇవ్వగా శార్దూల్ ఠాకూర్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు ఇచ్చాడు...

తొలి వన్డేకి తెంబ భువుమా కెప్టెన్‌గా వ్యవహరించగా అతని గైర్హజరీలో రెండో వన్డేకి కేశవ్ మహరాజ్ కెప్టెన్సీ చేశాడు. మూడో వన్డేలో ఈ ఇద్దరూ దూరం కావడంతో నేటి మ్యాచ్‌కి డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన