మొదలైన శార్దూల్ ఠాకూర్ పెళ్లి హంగామా... హల్దీ వేడుకలో స్టెప్పులేసిన టీమిండియా ఆల్‌రౌండర్...

Published : Feb 26, 2023, 12:27 PM IST
మొదలైన శార్దూల్ ఠాకూర్ పెళ్లి హంగామా... హల్దీ వేడుకలో స్టెప్పులేసిన టీమిండియా ఆల్‌రౌండర్...

సారాంశం

ఫిబ్రవరి 27న ప్రియురాలు మిట్టాలి పరూల్కర్‌తో శార్దూల్ ఠాకూర్ వివాహం... హల్దీ వేడుకలో బాలీవుడ్ సాంగ్స్‌కి స్టెప్పులేసిన టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్.. వీడియోలు వైరల్.. 

టీమిండియాలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. కెఎల్ రాహుల్‌తో పాటు అక్షర్ పటేల్...బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కాగా ఇప్పుడు ఈ లిస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా చేరిపోయాడు. అప్పుడెప్పుడో ఏడాదిన్నర క్రితం తన ప్రియురాలు  మిట్టాలీ పరూల్కర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు శార్దూల్ ఠాకూర్..

ఎట్టకేలకు ఫిబ్రవరి 27న శార్దూల్ ఠాకూర్- మిట్టాలీ పరూల్కర్ వివాహ వేడుక జరగనుంది. తాజాగా శార్దూల్ ఠాకూర్ స్వగృహంలో హల్దీ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ, సందడి చేస్తున్న శార్దూల్ ఠాకూర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు కూడా. అయితే పేలవ ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో కూడా శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 తర్వాత టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిన శార్దూల్ ఠాకూర్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు....

ముంబైలోని తన ఇంట్లో అతి కొద్ది మంది బంధు మిత్రుల మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శార్దూల్ ఠాకూర్, వివాహం విషయంలోనూ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్, మొదటి రెండు టెస్టుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు..

పెళ్లి కోసం మూడో టెస్టుకి ముందు టీమ్‌ నుంచి తప్పుకున్నాడు శార్దూల్ ఠాకూర్. ఫిబ్రవరి 27న జరిగే శార్దూల్ - మిట్టాలీ వివాహానికి భారత క్రికెట్ సభ్యులు కొందరు హాజరయ్యే అవకాశం ఉంది. ఆన్ ఫీల్డ్ ఆవేశంగా అరుస్తూ, దూకుడు చూపించే శార్దూల్ ఠాకూర్, బయట మాత్రం చాలా రిజర్వ్‌ అండ్ డీసెంట్. శార్దూల్ ఠాకూర్‌కి కాబోయే సతీమణి మిట్టాలీ కూడా సోషల్ మీడియా అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకోవడం విశేషం... 


ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు శార్దూల్ ఠాకూర్‌ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే శార్దూల్ ఠాకూర్ ఇచ్చిన పర్ఫామెన్స్‌తో సంతృప్తి చెందని ఢిల్లీ క్యాపిటల్స్, అతన్ని కేకేఆర్‌కి ట్రేడ్ చేసేసింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్‌ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకున్న కేకేఆర్, ఇదే మొత్తాన్ని చెల్లించబోతోంది.. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో శార్దూల్ ఠాకూర్ ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తాడో చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

టీమిండియా తరుపున 8 టెస్టులు, 34 వన్డేలు, 25 టీ20 మ్యాచులు ఆడిన శార్దూల్ ఠాకూర్... ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ముంబైలో మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం మార్చి 14న బీసీసీఐ క్యాంపులో చేరబోతున్నాడు శార్దూల్ ఠాకూర్.. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !