సీఎస్‌కేలో రైనా స్థానాన్ని భర్తీ చేసేది అతనే: వాట్సన్ సంకేతాలు

By Siva KodatiFirst Published Sep 11, 2020, 2:32 PM IST
Highlights

ఐపీఎల్ 2020లో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మళ్లీ తిరిగి యూఏఈ వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.

ఐపీఎల్ 2020లో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మళ్లీ తిరిగి యూఏఈ వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. సీఎస్‌కే ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశానికి బలం చేకూరుస్తోంది.

రైనా స్థానాన్ని ఓ గన్ ప్లేయర్‌తో పూడుస్తామంటూ వాట్సన్ చెప్పుకొచ్చాడు. చిన్న తలా లేకపోవడం చెన్నైకి పెద్ద లోటైనప్పటికీ, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక క్రికెటర్‌ను సిద్ధం చేశామని వాట్సన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడటంతో పాటు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రైనా ఒకరని అతనే తెలిపాడు. రైనా స్థానానికి మురళీ విజయ్‌ను ఎంపిక చేశామన్న వాట్సన్.. గత కొన్నేళ్ల నుంచి మురళీ విజయ్‌కు అవకాశాలు ఎక్కువగా రావడం లేదని ఆవేదన వ్యాఖ్యానించాడు.

మురళీ ఒక గన్ ప్లేయర్ అని.. యూఏఈ వికెట్ అతనికి బాగానే సెట్ అవుతుందని పేర్కొన్నాడు. స్పిన్‌ను విజయ్ సమర్థవంతంగా ఆడగలడని.. చాలా కాలంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడని వాట్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సారి మురళీ విజయ్‌కి అవకాం రావడం ఖాయమని.. అతనో మంచి బ్యాట్స్‌మెన్ అని షేన్ వాట్సన్ ప్రశంసించాడు. 

click me!