RRvsSRH: అదరగొట్టిన మనీశ్ పాండే, విజయ్ శంకర్... కీలక మ్యాచ్‌లో సన్‌‘రైజింగ్’ విక్టరీ...

Published : Oct 22, 2020, 10:54 PM ISTUpdated : Oct 22, 2020, 10:56 PM IST
RRvsSRH: అదరగొట్టిన మనీశ్ పాండే, విజయ్ శంకర్... కీలక మ్యాచ్‌లో సన్‌‘రైజింగ్’ విక్టరీ...

సారాంశం

మూడో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన విజయ్ శంకర్, మనీశ్ పాండే... మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... రెండు వికెట్లు తీసిన జోఫ్రా ఆర్చర్

IPL 2020: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయినా మనీశ్ పాండే, విజయ్ శంకర్ కలిసి రెండో వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరి అమూల్య భాగస్వామ్యం కారణంగా కీలకమైన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి జోఫ్రా ఆర్చర్ ఊహించని షాక్ ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ 4 పరుగులకే అవుట్ కాగా, బెయిర్ స్టో 10 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో మనీశ్ పాండే, విజయ్ శంకర్ కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని విజయతీరాలకు చేర్చారు.

మనీశ్ పాండే బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేయగా, విజయ్ శంకర్ బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌కి మాత్రమే రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ప్లేఆఫ్ రేసులో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇక ప్లేఆఫ్ చేరేందుకు ఎలాంటి అవకాశాలు లేనట్టే.

 

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు