ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ క్రికెటర్లు కరోనా పాజిటివ్ గా తేలి 24 గంటలన్నా గడవక ముందే మరో ఏడుగురు క్రికెటర్లు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై కరోనా వైరస్ పగబట్టినట్టుంది. ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ క్రికెటర్లు కరోనా పాజిటివ్ గా తేలి 24 గంటలన్నా గడవక ముందే మరో ఏడుగురు క్రికెటర్లు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. చూడబోతుంటే.. .. పాకిస్తాన్ ఇంగ్లాండ్ పర్యటనపై నీలినీడలు కమ్ముకునేలా కనబడుతున్నాయి.
తాజా కషిఫ్ భట్టి, మొహమ్మద్ హస్నయీన్, ఫకర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ హఫీజ్, వాహబ్ రియాజ్ లకు కరోనా వైరస్ సోకింది. నిన్న షాదాబ్ ఖాన్, హారీస్ రవూఫ్ కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. దీనితో మొత్తం కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 10కి చేరింది.
undefined
ఈ విషయంపై పాకిస్థాన్ టీం మానేజ్మెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. 10 మంది యువ క్రికెటర్లు ఇలా వైరస్ బారినపడటం జట్టుకు అంత శుభసూచకం కాదని టీం అధికారులు అభిప్రాయపడుతున్నారు. జట్టుకు సంబంధించిన ఒక సహాయక సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకినట్టుగా టీం అధికారి ఒకరు తెలిపారు.
లాహోర్ లో జూన్ 25వ తేదీన జట్టు ప్రతినిధులు, సెలెక్టర్లు మరోసారి సమావేశమై ఇంగ్లాండ్ టూర్ కి నూతన టీం ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. జూన్ 28వ తేదీన ఇంగ్లాండ్ కు పాకిస్తాన్ జట్టు బయల్దేరనుంది. ఇంగ్లాండ్ చేరుకున్నాక అక్కడ పాకిస్తాన్ జట్టు క్వారంటైన్ కాలాన్ని ఖచ్చితంగా గడపాల్సి ఉంటుంది.