ఆస్ట్రేలియన్ ఓపెన్: చెదిరిన కల.. సెరెనా కన్నీటి ధార

By Siva KodatiFirst Published Feb 18, 2021, 6:35 PM IST
Highlights

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరో సంచలనం చోటు చేసుకుంది. నిన్న క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సెమీ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి  నయోమి ఒసాకా చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరో సంచలనం చోటు చేసుకుంది. నిన్న క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

మహిళల సెమీ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి  నయోమి ఒసాకా చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. రాడ్ లావర్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒసాకా చేతిలో 6-3, 6-4 తేడాతో సెరెనా పరాజయం పాలయ్యారు.

కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌‌ కొట్టాలని గట్టిగా పోరాడినప్పటికీ, అనవసర తప్పిదాలు సెరెనా కొంపముంచాయి. చివరికి అనూహ‍్య ఓటమితో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ పోరాటం ముగిసింది. అయితే ఈ సందర్భంగా సెరెనా  టెన్నిస్‌కు వీడ్కోలు చెపుతారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సెరెనా భావోద్వేగానికి గురయ్యారు.

నిజానికి ఇది తాను గెలవాల్సిన మ్యాచ్‌ అంటూ సెరెనా కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో కన్నీటిని అణచుకోలేక  సమావేశం నుంచి నిష్క్రమించడం అందరినీ విస్మయ పర్చింది.

కెరీర్‌లో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిట్‌ దక్కించుకున్న సెరెనా  ఫైనల్‌ రేసు నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఆసీస్‌ ఫ్యాన్స్‌ నుంచి తనకు మంచి ఆదరణ లభించిందన్నారు సెరెనా.

కానీ ఒకవేళ తాను వీడ్కోలు చెప్పాల్సి వస్తే.. ఎవరికీ చెప్పనని, ఐయామ్‌ డన్‌ అంటూ జవాబిచ్చారు. కాగా శనివారం జరగనున్న ఫైనల్‌లో​ నాల్గవ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కోసం జెన్నిఫర్ బ్రాడి లేదా కరోలినా ముచోవాలలో ఒకరితో ఒసాకా తలపడాల్సి ఉంటుంది. 

click me!