‘దాదా’ బయోపిక్‌లో హృతిక్ రోషన్... గంగూలీ సలహా ఇది!

Published : Sep 18, 2020, 12:54 PM ISTUpdated : Sep 18, 2020, 12:56 PM IST
‘దాదా’ బయోపిక్‌లో హృతిక్ రోషన్... గంగూలీ సలహా ఇది!

సారాంశం

తన బయోపిక్‌లో నటించబోయే హీరోకి కండీషన్లు పెట్టిన సౌరవ్ గంగూలీ... తన ఫిజిక్‌కి వచ్చేసి, తనలా కనిపించాల్సిందేనంటూ డిమాండ్... 

భారత క్రికెట్ గతిని మార్చేసిన కెప్టెన్లతో ‘దాదా’ సౌరవ్ గంగూలీ ఒకడు. ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూసే పరిస్థితి నుంచి విదేశాల్లో విజయాలు సాధించే స్థాయికి టీమిండియా చేర్చిన ఘనత గంగూలీకే దక్కుతుంది. జట్టుకి మ్యాచ్ ఫిక్సింగ్ ఊబిలో కూరుకుపోయిన భారత జట్టును అందులో నుంచి బయటికి తెచ్చి, గెలుపు కసిని నేర్పించాడు ‘బెంగాల్ టైగర్’. మహేంద్ర సింగ్ ధోనీ, యువీ, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఎందరో స్టార్లను పరిచయం చేశాడు సౌరవ్ గంగూలీ.

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తోన్న సౌరవ గంగూలీ జీవితంపై బాలీవుడ్‌లో బయోపిక్ రూపొందుతోందని వార్తలు వచ్చాయి. ఈ బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ‘దాదా’గా కనిపించబోతున్నాడని సమాచారం.

 

 

తన బయోపిక్‌లో నటించబోయే హీరోకి కండీషన్లు పెట్టాడు గంగూలీ. బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియాకి ఆన్‌లైన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బయోపిక్ గురించి మాట్లాడాడు దాదా. ‘నా బయోపిక్‌లో ఎవ్వరు నటిస్తారనే నాకు తెలీదు. కానీ ఎవ్వరూ నటించినా వాళ్లు నాలా కనిపించాలి. హృతిక్ రోషన్‌కి మంచి బాడీ ఉంది. నేను కూడా అతని బాడీ అంటే ఇష్టపడేవాణ్ణి. అలాంటి బాడీ పెంచాలని అనుకునేవాడిని. ఇప్పుడు నా బయోపిక్‌లో హృ‌తిక్ నటిస్తే మాత్రం... అతను నాలా బాడీని మార్చుకోవాలి...’ అని నవ్వేశాడు గంగూలీ.

సారథిగా ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన గంగూలీ, కెరీర్‌ చివర్లో జట్టులో స్థానం కోల్పోయాడు. కష్టపడి ఫామ్‌లోకి వచ్చి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇవన్నీ దాదా బయోపిక్‌లో ఉండే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?