DC vs CSK : ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి ఐపీఎల్ 2024లో తొలి విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత ఢిల్లి కెప్టెన్ రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధంచాడు.
Rishabh Pant : ఐపీఎల్ 2024 13వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. వైజాగ్ లోని డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. బ్యాటింగ్ లో షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ రాణించారు. ఇక బౌలింగ్ లో ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుచేసింది.
192 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరంభంలోనే చెన్నై కి షాక్ తగిలింది. తొలి ఓవర్ లోనే రుతురాజ్ గైక్వాడ్, 3వ ఓవర్ లో రచిన్ రవీంద్ర రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహానే 45 పరుగులు, డారిల్ మిచెల్ 34 పరుగులు చేశారు. చివరలో ఎంఎస్ ధోని 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు కానీ, చెన్నైకి విజయాన్ని అందించలేకపోయాడు. చివరలో ధోని ఉన్నంత సేపు ధోని ధోని అంటూ గ్రౌండ్ హోరెత్తింది. ధోని ఇన్నింగ్స్ కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Don't know why I don't feel sad for CSK's loss after watching Dhoni's batting. 🥺🔥 pic.twitter.com/cz90rew7K9
— ♡ (@MSDtilleternity)
రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్.. 160 స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచరీ కొట్టిన ఢిల్లీ కెప్టెన్