నువ్వు వాటికి లొంగనివాడివి: తన భర్త ఎలాంటి వాడో చెప్పిన ధోనీ భార్య

Siva Kodati |  
Published : Jul 07, 2020, 02:41 PM ISTUpdated : Jul 07, 2020, 02:42 PM IST
నువ్వు వాటికి లొంగనివాడివి: తన భర్త ఎలాంటి వాడో చెప్పిన ధోనీ భార్య

సారాంశం

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహీ సతీమణి సాక్షి సింగ్ వినూత్నంగా విషెస్ తెలియజేశారు

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహీ సతీమణి సాక్షి సింగ్ వినూత్నంగా విషెస్ తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తమ ఫామ్ హౌజ్‌లో ధోనీతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

Also Read:ధోనీ బర్త్ డే... హెలికాప్టర్ సాంగ్ తో బ్రావో స్పెషల్ విషెస్

‘‘ నీ పుట్టినరోజు గుర్తు చేసుకుంటూ... ఒక ఏడాది గడిచిపోయింది. కాసింత వయసు పెరిగింది, ఇంకొంచెం తెలివిగా, ఇంకొంచెం తీయగా మారాల్సిన అవసరం వుంది. నువ్వు తీయని శుభాకాంక్షలు, బహుమతులకు లొంగని వాడివి. కేకు కోసి, క్యాండిల్స్ వెలిగించి నీ జీవితంలోని మరో ఏడాదిని సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్‌డే ధోనీ’ అని సాక్షి కామెంట్ పెట్టింది.

అంతకుముందు ధోనికి.. విరాట్ కోహ్లీ బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే మహీ భాయ్.. మంచి ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాలని కోరుతున్నా.. అంటూ మిస్టర్ కూల్‌తో పలు సందర్భాల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: సంజూ, అభిషేక్‌లలో ఒకరికి షాక్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లోకి వైభవ్ సూర్యవంశీ