దొరక్క దొరక్క దొరికాడు: లాక్‌డౌన్‌లో ధోనీని అస్సలు వదలడం లేదుగా

Siva Kodati |  
Published : Apr 20, 2020, 03:28 PM ISTUpdated : Apr 20, 2020, 03:31 PM IST
దొరక్క దొరక్క దొరికాడు: లాక్‌డౌన్‌లో ధోనీని అస్సలు వదలడం లేదుగా

సారాంశం

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. భారతదేశం కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో క్షణం కూడా తీరిక లేని వారు ఈ సమయాన్ని తమ కుటుంబసభ్యులతో గడిపేందుకు ఉపయోగించుకుంటున్నారు

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. భారతదేశం కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో క్షణం కూడా తీరిక లేని వారు ఈ సమయాన్ని తమ కుటుంబసభ్యులతో గడిపేందుకు ఉపయోగించుకుంటున్నారు.

అటు దేశంలో ఐపీఎల్ సహా అన్ని క్రీడా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. దీంతో క్రికెటర్లు కూడా తమ ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భర్తకు విరామం దొరకడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ఆయనను అస్సలు వదలటం లేదు.

లాక్‌డౌన్ సమయాన్ని గడిపేందుకు గాను కుటుంబం మొత్తం రాంచీలోని తన ఫామ్ హౌస్‌కు చేరుకుంది. అక్కడ జరిగే ప్రతి విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది సాక్షి.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ మిస్టర్ స్వీటీ అటెన్షన్ కోసం అని క్యాప్షన్ పెట్టింది’. బెడ్‌రూమ్‌లో సాక్షి తన భర్త ధోనీ కాలును తన నాలుకతో నాకుతూ కనిపిస్తోంది. అంతేకాదు అక్కడే ఉన్న ధోనీ ముఖంలోని ఎక్స్‌ప్రెషన్ చూస్తే కూడా ఆ విషయం తెలిసిపోతుంది.

కాగా దేశంలో లాక్‌డౌన్ పొడిగించడంతో ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ధోనీ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దీంతో తీవ్ర నిరాశ ఎదురైంది. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !