సఫారీ టెస్ట్ సిరీస్: భారత్ 'ద్వితీయాల' అద్వితీయ రికార్డు, ప్రపంచ రికార్డు బద్దలు

By telugu teamFirst Published Oct 20, 2019, 5:56 PM IST
Highlights

సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది. 

రాంచి: సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది. 

ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రో'హిట్' రికార్డు

ఒక్క సిరీసులోనే మూడు డబల్ సెంచరీలు సాధించడం ద్వారా భరత్ 64 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత మరోసారి ఆ ఘనత సాధించింది. గతంలో 1955-56 సీజన్లో న్యూజిలాండ్ తోని జరిగిన ద్వైపాక్షిక టెస్టు సిరీసులో మూడు డబల్ సెంచరీలు నమోదయ్యాయి. ఆ సిరీస్ లో వినూ మన్కడ్ రెండు డబల్ సెంచరీలు చేయగా [పాలీ ఉమ్రిగర్ ఒక డబల్ సెంచరీ చేసాడు. ఆ సిరీస్ తరువాత భారత్ మరల నేడు 64 సంవత్సరాల ఎదురుచూపు అనంతరం ఈ అరుదైన ఘనతను సాధించింది. 

ఈ సఫారీల సిరీసులో తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ ద్వి శతకం బాదాడు. రెండో టెస్టులో కెప్టెన్ కోహ్లీ డబల్ సెంచరీతో కదం తొక్కాడు. మూడో టెస్టులో రోహిత్ శర్మ అద్వితీయ ద్విశతకాన్ని సాధించాడు. ఇలా రోహిత్ శర్మ సాధించైనా సెంచరీతో భారత్ ఈ రికార్డును సృష్టించింది. 

ఇప్పటికే ఈ సిరీస్ గెలవడం ద్వారా భారత్ ప్రపంచ రికార్డును తిరగరాసింది. స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీసులను గెలిచిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. స్వదేశంలో ఇప్పటివరకు వరుసగా 10 టెస్టు సిరీసులను గెలిచినా దేశంగా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును మనం బ్రేక్ చేసిన విషయం మనకు తెలిసిందే. 

click me!