రాంచి టెస్ట్: ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రో'హిట్' రికార్డు

By telugu teamFirst Published Oct 20, 2019, 5:12 PM IST
Highlights

డబల్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు గేల్ అయినా, టెండూల్కర్ అయినా, సెహ్వాగ్ అయినా తొలుత టెస్టుల్లో డబల్ సెంచరీలు కొట్టి ఆ తరువాత వన్డేల్లో కొట్టారు. కానీ రోహిత్ మాత్రం డిఫరెంట్. వన్డేల్లో డబల్ సెంచరీ కొట్టిన తరువాత టెస్టుల్లో డబల్ సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

రాంచి: భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో, వన్డేల్లో డబల్ సెంచరీలు సాధించిన మూడవ భారత క్రీడాకారుడిగా, అంతర్జాతీయంగా నాలుగవ క్రీడాకారుడిగా రోహిత్ శర్మ నిలిచాడు. భరత్ తరుపున ఇప్పటివరకు కేవలం సచిన్, సెహ్వాగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. వారి సరసన రోహిత్ శర్మ కూడా నిలిచాడు. అంతర్జాతీయంగా క్రిస్ గేల్ కూడా ఇలానే వన్డేల్లో, టెస్టుల్లో డబల్ సెంచరీ చేసాడు. 

రోహిత్ శర్మ ఇప్పటికే వన్డేల్లో మూడు డబల్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తోని జరుగుతున్న సిరీస్ లో తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేసాడు. కేవలం 249 బంతుల్లోనే 28 ఫోరులు,4 సిక్సర్లతో డబల్ సెంచరీ మార్కుని అందుకున్నాడు. సెంచరీని సైతం నిన్న సిక్స్ కొట్టి పూర్తిచేసిన రోహిత్, నేటి డబల్ సెంచరీని కూడా ఇలా సిక్సర్ తోనే అందుకోవడం విశేషం. 

రోహిత్ శర్మ డబల్ సెంచరీ మార్కును చేరుకుంటున్నాడు అనుకుంటున్న తరుణంలో లంచ్ విరామం. ఈ 40నిమిషాల పాటు రోహిత్ ఏ రేంజ్ లో ఒత్తిడిని ఎదుర్కొని ఉంది ఉంటాడో! లంచ్ తరువాత ఎంగిడి బౌలింగ్ లో సిక్సర్ కొట్టి తన డబల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

ఈ డబల్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు గేల్ అయినా, టెండూల్కర్ అయినా, సెహ్వాగ్ అయినా తొలుత టెస్టుల్లో డబల్ సెంచరీలు కొట్టి ఆ తరువాత వన్డేల్లో కొట్టారు. కానీ రోహిత్ మాత్రం డిఫరెంట్. వన్డేల్లో డబల్ సెంచరీ కొట్టిన తరువాత టెస్టుల్లో డబల్ సెంచరీ కొట్టిన మొదటి వ్యక్తిగా హిట్ మ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

ఇక్కడితోనే రోహిత్ శర్మ రికార్డులు ఆగిపోలేదు. ఒకే సిరీస్ లో 500 పరుగులకు పైగా సాధించిన 5వ భారత ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డు క్లబ్బులోకెక్కాడు. వినూ మన్కడ్, కుందేరేన్, సునీల్ గవాస్కర్, సెహ్వాగ్ లు గతంలో ఈ ఫీట్ సాధించారు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఈ 550ప్లస్ క్లబ్బులో చేరాడు. 

click me!