Asia Cup 2023 Sri Lanka vs Bangladesh Super 4: 9 వికెట్లు కోల్పోయి 257 పరుగుల స్కోరు చేసిన శ్రీలంక.. 93 పరుగులు చేసిన సమరవిక్రమ...
ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 26 భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 257 పరుగుల స్కోరు చేసింది.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా కుసాల్ మెండిస్, సధీర సమరవిక్రమ హాఫ్ సెంచరీలతో రాణించి... లంకకు భారీ స్కోరు అందించారు. 17 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన దిముత్ కరుణరత్నే, హసన్ మహమూద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
పథుమ్ నిశ్శంక 60 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నిశ్శంక, కుసాల్ మెండిస్ కలిసి రెండో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 73 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన కుసాల్ మెండిల్ కూడా షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
undefined
చరిత్ అసలంక 10 పరుగులు చేయగా ధనంజయ డి సిల్వ 6 పరుగులు, దసున్ శనక 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 3 పరుగులు చేసిన దునిత్ వల్లలాగే రనౌట్ అయ్యాడు. మహీశ్ తీక్షణ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన సధీర సమరవిక్రమ 72 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో 4, 6 బాదిన సమరవిక్రమ, చివరి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్‌కి 3 వికెట్లు దక్కాయి. యంగ్ బౌలర్ హసన్ మహమూద్ 3 వికెట్లు తీయగా షోరిఫుల్ ఇస్లాంకి రెండు వికెట్లు దక్కాయి.
ఇరు జట్ల మధ్య జరిగిన గ్రూప్ బీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి, 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ల తడబాటు చూస్తే, శ్రీలంక చేసిన స్కోరు వారికి చాలా పెద్ద టార్గెట్ కిందే లెక్క..
అయితే ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 334 పరుగుల భారీ స్కోరు చేసింది. మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో సెంచరీలతో చెలరేగారు. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఇదే రకమైన పర్ఫామెన్స్ చూపించగలిగితే.. ఈ లక్ష్యం వారికి చిన్నదైపోతుంది.