శ్రీలంకతో మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడి 2 పరుగుల తేడాతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. అధికారుల సరైన లెక్కలు సమర్పించకపోవడం వల్లే ఓడిపోయామంటూ ఏసీసీకి ఫిర్యాదు..
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ శ్రీలంక - ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓడిన ఆఫ్ఘాన్, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయింది. అయితే సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించేందుకే చేయాల్సిన పరుగుల గురించి సరైన సమాచారం ఆఫ్ఘాన్‌కి అందలేదు.
క్వాలిఫైకేషన్ గణాంకాల గురించి సరైన సమాచారం ఇవ్వకుండా ఆఫ్ఘాన్ ఓటమికి కారణమయ్యారంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులపై కేసు వేసింది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు. సరైన సమాచారం ఇవ్వకుండా చేసిన పొరపాటు వల్లే తాము ఓడిపోయామని, ఇందుకు కారణమైన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు..
undefined
దీంతో మరోసారి బంగ్లాదేశ్- ఆఫ్ఘాన్ మ్యాచ్ వార్తల్లో నిలిచింది. మొదటి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకతో మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడి 2 పరుగుల తేడాతో ఓడింది..
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 291 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో ఛేదించి ఉంటే, ఆఫ్ఘాన్ సూపర్ 4 స్టేజీకి అర్హత సాధించి ఉండేది. అనుకున్నట్టుగానే 37.1 ఓవర్లలో లక్ష్యాన్ని కొట్టేందుకు గట్టిగా ప్రయత్నించింది ఆఫ్ఘాన్..
37వ ఓవర్‌లో రషీద్ ఖాన్ 3 ఫోర్లతో 12 పరుగులు రాబట్టాడు. 38వ ఓవర్ మొదటి బంతికి 3 పరుగులు చేస్తే, ఆఫ్ఘాన్ నేరుగా సూపర్ 4 రౌండ్‌కి చేరి ఉండేది. అయితే రషీద్ ఖాన్ నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉండడంతో స్ట్రైయిక్‌లో ఉన్న ముజీబ్ వుర్ రహీమ్, సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన ఫజక్‌హక్ ఫరూకీ కూడా రషీద్ ఖాన్‌కి స్ట్రైయిక్ ఇవ్వకుండా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
37 ఓవర్లలో 289 పరుగులు చేసిన ఆఫ్ఘార్, ఆ తర్వాత బంతికి 3 పరుగులు, అది మిస్ అయితే 37.2 ఓవర్లకు 293, 37.3 ఓవర్లకు 294, 37.5 ఓవర్లకు 295, 37.6 ఓవర్లకు 296.. అది కూడా మిస్ అయితే 38.1 ఓవర్లకు 297 పరుగులు చేసినా సూపర్ 4 స్టేజీకి అర్హత సాధించి ఉండేది.
అంటే 38వ ఓవర్ మొదటి బంతికి ముజీబ్ సింగిల్ తీసి రషీద్ ఖాన్‌కి స్ట్రైయిక్ ఇస్తే, ఆ తర్వాత 3 బంతుల్లో ఫోర్ వచ్చినా.. ఆఫ్ఘాన్ సూపర్ 4 రౌండ్‌కి చేరి ఉండేది. అలా కాకుండా 38వ ఓవర్ మెయిడిన్ ఆడి, 38.1 ఓవర్ బంతికి రషీద్ ఖాన్ సిక్సర్ కొట్టినా.. నెట్ రన్ రేట్‌తో ఆఫ్ఘాన్ సూపర్ 4 రౌండ్‌కి వచ్చి ఉండేది. అయితే ఈ విషయం గురించి ఆఫ్ఘాన్ జట్టుకి తెలియకుండా పోవడం సిక్సర్ కొట్టాలనే ఆత్రంలో 2 వికెట్లు కోల్పోయి, 2 పరుగుల తేడాతో ఓడింది..