వరల్డ్ కప్ గెలిపించేందుకు నీ మోకాలు పోగొట్టుకున్నా బాగుండేది... ఆఫ్రిదీపై షోయబ్ అక్తర్ కామెంట్...

Published : Feb 21, 2023, 05:30 PM IST
వరల్డ్ కప్ గెలిపించేందుకు నీ మోకాలు పోగొట్టుకున్నా బాగుండేది... ఆఫ్రిదీపై షోయబ్ అక్తర్ కామెంట్...

సారాంశం

T20 World cup 2022 ఫైనల్‌లో గాయంతో మూడో ఓవర్ పూర్తి చేయని షాహీన్ ఆఫ్రిదీ... ఆ ప్లేస్‌లో తాను ఉండి ఉంటే, టీమ్ కోసం చచ్చిపోయేవాడినని కామెంట్ చేసిన పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగి ఫైనల్‌కి దూసుకెళ్లింది పాకిస్తాన్. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతుల్లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, రెండో మ్యాచ్‌లో జింబాబ్వేపై ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే సౌతాఫ్రికా ఓటమితో అదృష్టం ఈడ్చి పెట్టి తన్నడంతో వెళ్లి సెమీ ఫైనల్ బుట్టులో పడింది పాకిస్తాన్...

న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడించి, ఫైనల్‌కి వెళ్లిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, పాక్‌ని 5 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్ గెలిచింది. గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ, టీ20 వరల్డ్ కప్‌ 2022లో నేరుగా బరిలో దిగాడు..

అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్టు కనిపించిన షాహీన్ ఆఫ్రిదీ, ఫైనల్ మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన దశలో బంతిని షాహీన్ ఆఫ్రిదీకి అందించాడు బాబర్ ఆజమ్..

మొయిన్ ఆలీకి మొదటి బంతిని వేసిన షాహీన్ ఆఫ్రిదీ, రెండో బాల్ వేయడానికి రన్నప్ చేస్తూ ఆగిపోయాడు. నొప్పితో మ్యాచ్ మధ్యలో నుంచి తప్పుకోవడంతో ఆ ఓవర్‌ని ఇఫ్థికర్ అహ్మద్‌తో కంప్లీట్ చేయించాడు బాబర్ ఆజమ్. ఇఫ్తికర్ 5 వేయగా అందులో 13 పరుగులు రాబట్టింది ఇంగ్లాండ్.. 

19వ ఓవర్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుని మ్యాచ్‌ని ముగించింది. ‘షాహీన్ ఆఫ్రిదీ ఆ మ్యాచ్‌లో తన మోకాలిని త్యాగం చేయాల్సింది. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా. ఎందుకంటే అది మామూలు మ్యాచ్ కాదు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్. బౌలింగ్ పూర్తి చేసి, పాక్‌ని గెలిపించి ప్రాణ త్యాగం చేసినా అతను సెలబ్రిటీ అయ్యేవాడు..

అతని స్థానంలో నేను ఉండే అదే చేసేవాడిని. వరల్డ్ కప్ ఫైనల్‌లో కిందపడిపోతే నా వల్ల కాదని చేతులు ఎత్తేయను. లేచి మళ్లీ బలం తెచ్చుకుని బౌలింగ్ చేస్తా. ఆ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా నాకు సంతోషమే. నేను ఆడేటప్పుడు నొప్పిని భరిస్తూ ఎన్నోసార్లు బౌలింగ్ చేశా. కొన్నిసార్లు ప్రతీ బాల్ తర్వాత ఇంజక్షన్ వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. డెడికేషన్ అంటే అలా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..  

షాహీన్ ఆఫ్రిదీ, మ్యాచ్ ఆఖర్లో తప్పుకోవడం వెనక చాలా రకాల కథనాలు వినిపించాయి. 2021 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో వరుసగా 3 సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు. ఈ సమయంలో ఆఫ్రిదీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మళ్లీ అలాంటి పరిస్థితి ఎక్కడ వస్తుందోనని ఆఫ్రిదీ భయపడి గాయం వంకతో తప్పుకున్నాడని కూడా ట్రోల్స్ వచ్చాయి.. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు