సచిన్ టెండూల్కర్‌కి కరోనా పాజిటివ్... సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మాస్టర్...

Published : Mar 27, 2021, 10:27 AM ISTUpdated : Mar 27, 2021, 10:29 AM IST
సచిన్ టెండూల్కర్‌కి కరోనా పాజిటివ్... సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మాస్టర్...

సారాంశం

తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియచేసిన సచిన్ టెండూల్కర్... సచిన్ కుటుంబసభ్యులకు నెగిటివ్... ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటన...

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ టైటిల్ గెలిచిన ఇండియా లెజెండ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన భారత మాజీ క్రికెటర్, ‘లిటిల్ మాస్టర్’, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేశాడు సచిన్ టెండూల్కర్.

‘ఈరోజు కొన్ని లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నా, పాజిటివ్ వచ్చింది. మా ఇంట్లో మిగిలిన వారికి నెగిటివ్ వచ్చింది. నా ఇంట్లోనే హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నా. డాక్టర్లు సూచించిన ప్రకారం కరోనా ప్రోటోకాల్ పాటిస్తాను... కరోనాను జయించడానికి సహకరిస్తున్న హెల్త్ కేర్ ప్రోఫెషనల్స్‌కి ధన్యవాదాలు’ అంటూ పోస్టు చేశాడు సచిన్ టెండూల్కర్.

గత వారం లక్నోలో టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్, సెహ్వాగ్, కైఫ్ వంటి జట్టుతో కలిసి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడాడు సచిన్ టెండూల్కర్. తాను 200 టెస్టులు ఆడితే, 277 కరోనా టెస్టులు చేయించుకున్నానని కూడా తెలిపాడు మాస్టర్ బ్లాస్టర్...

PREV
click me!

Recommended Stories

T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్