దాదా ఇంట్లో సచిన్ భోజనం... నెట్టింట ఫోటో వైరల్

Published : May 15, 2020, 08:42 AM IST
దాదా ఇంట్లో సచిన్ భోజనం... నెట్టింట ఫోటో వైరల్

సారాంశం

త్రోబ్యాక్ ఫోటోని మళ్లీ షేర్ చేసిన సచిన్.. ఆ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా సచిన్.. గంగూలీ అమ్మగారిని కూడా గుర్తు చేసుకోవడం విశేషం.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కమ్మని భోజనం లాగించేశారు. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా తన సోషల్ మీడియాలో తెలియజేయగా.. దానికి సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేశాడు. కాగా... ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కదా దాదా ఇంటికి సచిన్ వెళ్లాడేంటా అనుకుంటున్నారా..? కంగారు పడకండి ఈ ఫోటో ఇప్పటిది కాదు. సచిన్, గంగూలీ ఇద్దరూ కలిసి మంచి ఫాంలో ఉన్నప్పటి ఫోటో ఇది. అప్పుడు దాదా ఇంటికి వెళ్లిన సచిన్.. మంచి భోజనం చేశారట. ఆ త్రోబ్యాక్ ఫోటోని మళ్లీ షేర్ చేసిన సచిన్.. ఆ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా సచిన్.. గంగూలీ అమ్మగారిని కూడా గుర్తు చేసుకోవడం విశేషం.

 

కాగా.. ఆ ఫోటోలో సచిన్, గంగూలీలు ఇద్దరూ చాలా యంగ్ గా ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరో విషయం ఏమిటంటే.. దాదాపు గంగూలీని అందరూ దాదా అనే పేరుతోనే పిలుస్తారు. అయితే.. సచిన్ మాత్రం దాది అని పిలుస్తారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సచిన్ చెప్పగా.. ఈ ఫోటో కాప్షన్ లో కూడా దాదీ అనే పేర్కొనడం విశేషం.
 

PREV
click me!

Recommended Stories

IND vs NZ: చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ సిద్ధం.. ఆ ఒక్క ఇన్నింగ్స్ కోసమే వెయిటింగ్ !
Top 5 Batters : రోహిత్, కోహ్లీ కాదు.. గత ఐదేళ్లలో వన్డేల్లో పరుగుల వరద పారించింది ఈ ఐదుగురే !