సచిన్ స్పెషల్ వడాపావ్ పై కన్నేసిన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?

Published : Sep 07, 2020, 09:18 AM IST
సచిన్ స్పెషల్ వడాపావ్ పై కన్నేసిన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?

సారాంశం

 తనకు ఇష్టమైన వడాపావ్ ని ఆదివారం సచిన్.. స్వయంగా తయారు చేశారు. తాను వండిన వడాపావ్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ప్రస్తుతం ఆయన స్టేడియంలోకి అడుగుపెట్టి.. తన ఆటతో అభిమానులను అలరించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు. కాగా... సచిన్ కి వడాపావ్ అంటే చాలా ఇష్టమని  అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పలు ఇంటర్వ్యూల్లో చాలా సార్లు ఈ విషయాన్ని తెలియజేశారు.

 

కాగా.. తనకు ఇష్టమైన వడాపావ్ ని ఆదివారం సచిన్.. స్వయంగా తయారు చేశారు. తాను వండిన వడాపావ్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. కాగా.. అయితే.. తన ఫేవరేట్ స్నాక్ ని టేస్ట్ చేయడానికి ఓ అనుకోని అతిథి తన ఇంటికి వచ్చారని ఆయన చెప్పారు.

ఒక ఫోటోలో ఆయన వడాపావ్ తయారు చేస్తున్న ఫోటో షేర్ చేసి.. అది తినడానికి వచ్చిన గెస్ట్ ఎవరో తెలుసుకోవడానికి మరో ఫోటో స్వైప్ చేసి మరీ చూడమని చెప్పారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా..? ఓక పిల్లి. లోపలికి రావడానికి నక్కినక్కి చూస్తోంది. దానిని ఫోటో తీసి.. ఇదే నా గెస్ట్ అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. ఆయన పోస్టుకి అభిమానుల నుంచి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. 

PREV
click me!

Recommended Stories

Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్
IND vs NZ : మరోసారి న్యూజిలాండ్ చేతిలో బలి.. కుల్దీప్ కెరీర్‌లో రెండోసారి ఇలా!