ముంబై వీధుల్లో తప్పిపోయిన సచిన్ టెండూల్కర్... ఆటోడ్రైవర్ సాయంతో...

By team teluguFirst Published Nov 26, 2020, 6:00 PM IST
Highlights

ముంబై వీధుల్లో రూట్ మరిచిపోయి తికమకపడిన సచిన్ టెండూల్కర్...

గూగుల్ మ్యాప్‌లో కూడా కనిపించిన దారి...

ఆటోడ్రైవర్ సాయంతో గమ్యం చేరిన మాస్టర్ బ్లాస్టర్...

100MB మొబైల్ యాప్‌లో పాత సంఘటనను పంచుకున్న క్రికెట్ గాడ్...

క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని స్టార్ అయిన సచిన్ టెండూల్కర్... ముంబై వీధుల్లో ఆగమయ్యారు. రూట్ మరిచిపోయి తికమకపడుతున్న తరుణంలో ఓ ఆటోడ్రైవర్... క్రికెట్ దేవుడికి దారి చూపాడట. ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నాడు సచిన్ టెండూల్కర్. 10 నెలల క్రితం 2020 జనవరిలో సచిన్ టెండూల్కర్ ముంబైలోని సబర్బన్ వీధుల్లో ప్రయాణిస్తూ ఓ గల్లీలోకి ఎంటర్ అయ్యాడట.

ఆ గల్లీలో నుంచి బయటికి ఎలా రావాలో తెలియక కంఫ్యూజ్ అయ్యాడట సచిన్. గూగుల్ మాప్స్‌లో కూడా మెయిన్ రోడ్డుకి దారి కనిపించలేదట. అప్పుడు అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్... సచిన్ పరిస్థితి తెలుసుకుని సాయం చేశాడట.

డ్రైవరన్న సూచనతో మెయిన్ రోడ్డు వరకూ ఆటోను ఫాలో అయిన సచిన్ టెండూల్కర్... రోడ్డు మీదకి వచ్చాక అతనితో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ వీడియోను 10 నెలల తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశాడు సచిన్ టెండూల్కర్. 

‘టెక్నాలజీ మనకి చాలా సాయం చేస్తోంది. కానీ సాటి మనిషి చేసే సాయం ముందు అవన్నీ చిన్నవే. దారి తెలియక సతమతమవుతున్న సమయంలో నాకు ఈ జెంటిల్మెన్, ఆటో డ్రైవర్ మంగేశ్ సాయం చేశాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.

click me!