సచిన్ ఫాలోయింగ్ అక్కడి వరకే... సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్!

By team teluguFirst Published Sep 20, 2020, 6:20 PM IST
Highlights

సచిన్ కంటే ధోనీకి ఫాలోయింగ్ ఎక్కువంటూ సన్నీ వ్యాఖ్యలు...

సచిన్ ఫాలోయింగ్ ముంబై, కోల్‌కత్తాలకే పరిమితమైందన్న సునీల్ గవాస్కర్...

‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీకి కూడా ఢిల్లీ, బెంగళూరుల్లోనే ఫ్యాన్స్ ఉన్నారంటూ వ్యాఖ్య...

సచిన్ టెండూల్కర్... భారత క్రికెట్ దేవుడు. సచిన్ ఆటను చూస్తూ... టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌లోకి వచ్చారు చాలామంది. సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే, యావత్ భారతం ఒక్కసారిగా స్థంభించిపోయేది. అలాంటి సచిన్ టెండూల్కర్‌‌కి కేవలం రెండు నగరాల్లో మాత్రమే ఫాలోయింగ్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

వన్డే వరల్డ్‌కప్ తర్వాత 437 బ్రేక్ తీసుకుని క్రికెట్ ఆడుతున్న ధోనీ, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ చూడాలని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఐదో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన రెండు బంతులు ఆడిన పరుగులేమీ చేయలేదు. 

‘ధోనీ రాంఛీ నుంచి వచ్చాడు. అక్కడ క్రికెట్ కల్చర్ పెద్దగా ఉండదు. కానీ యావత్ భారతం అతన్ని అభిమానిస్తుంది. టెండూల్కర్‌కి ముంబై, కోల్‌కత్తాలో మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. కోహ్లీకి ఢిల్లీ, బెంగళూరులోనే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. కానీ ధోనీకి మాత్రం దేశమంతటా ఉంటారు’ అన్నాడు సునీల్ గవాస్కర్.

ధోనీ ఫాలోయింగ్ గురించి చెప్పడం తప్పు కాదు కానీ, దేశంలో క్రికెట్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి కారణమైన సచిన్‌ను ధోనీ ముందు తక్కువ చేసి మాట్లాడడం ఆయన్ని అవమానించడమే అంటున్నారు ‘క్రికెట్ గాడ్’ ఫ్యాన్స్. తనకు ఇష్టమైనంత మాత్రాన ‘భారత రత్న’ అవార్డు పొందిన వ్యక్తికి మిగిలిన నగరాల్లో క్రేజ్ లేదనడం సమంజసం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. 

click me!