రుతురాజ్ కిరాక్ స్టంపింగ్.. ధోని నుంచి నేర్చుకున్నాడా..? తదుపరి సీఎస్కే కెప్టెన్ అంటూ..

By Srinivas MFirst Published Oct 20, 2022, 1:04 PM IST
Highlights

SMAT 2022: జాతీయ జట్టులో  అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నా అనుకున్న స్థాయిలో రాణించడంలో విఫలమవుతున్న మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్.. దేశవాళీలో మాత్రం అదరగొడుతున్నాడు. 

దేశవాళీ క్రికెట్ లో రుతురాజ్ గైక్వాడ్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.  జాతీయ జట్టులో  పలుమార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ పెద్దగా  సక్సెస్ అవని ఈ పూణె బ్యాటర్..  దేశవాళీలో మాత్రం రెచ్చిపోతున్నాడు. తాజాగా సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) - 2022 లో కూడా బ్యాట్ తోనే గాక వికెట్ కీపర్ గానూ  శెబాష్ అనిపిస్తున్నాడు. బుధవారం కేరళతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు సారథి సంజూ శాంసన్ ను కళ్లు మూసి తెరిచేలోపు స్టంపౌట్ చేశాడు.  

లీగ్ స్టేజ్ లో భాగంగా  బుధవారం కేరళ - మహారాష్ట్రల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో   కేరళ  ఛేదనకు దిగింది.  లక్ష్య ఛేదనలో  భాగంగా కేరళ 73 కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.

Latest Videos

ఐదో స్థానంలో వచ్చిన   సంజూ శాంసన్ (3) క్రీజులోంచి ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించిన రుతురాజ్.. సత్యజీత్ వేసిన 13 ఓవర్లో మూడో బంతికి శాంసన్  ను  స్టంపౌట్ చేశాడు. శాంసన్ క్రీజు దాటడాన్ని చూసిన గైక్వాడ్.. వెంటనే బంతిని అందుకుని కళ్లు మూసి తెరిచేంతలోపే  స్టంపౌట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  వాస్తవానికి మహరాష్ట్ర జట్టుకు అనూజ్ రావత్ వికెట్ కీపర్ గా ఉన్నాడు. కానీ గత రెండు మ్యాచ్ లలో అతడు కాకుండా గైక్వాడే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mufaddal Vohra (@mufatweets)

ఇక ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ధోని నుంచి నేర్చుకున్నావా గైక్వాడ్..’, ‘ధోని తర్వాత  చెన్నైని నడిపించేది రుతురాజే.. అందుకే వికెట్ కీపింగ్ లో మెరుగవుతున్నాడు..’ అని  కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్  లో ధోని సారథ్యం వహిస్తున్న  చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్న విషయం తెలిసిందే. క్షణాల్లో స్టంపింగ్స్ చేయడంలో ధోని దిట్ట అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. 

కేరళ - మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి  167 పరుగులు చేసింది. రుతురాజ్  68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేశాడు.   మరో ఓపెనర్ పవన్ షా (29 బంతుల్లో 31, 2 సిక్సర్లు)  రాణించాడు.  ఈ  ట్రోపీలో రుతురాజ్ కు ఇది  రెండో సెంచరీ కావడం గమనార్హం. లక్ష్య ఛేదనలో కేరళ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ రోహన్ కన్నుమ్మల్ (58) మినహా అందరూ విఫలమయ్యారు. 

click me!