WTC Final 2023: ఓవల్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ కంగారూలదే..

By Srinivas MFirst Published Jun 7, 2023, 2:37 PM IST
Highlights

WTC Final 2023: కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న   ఐసీసీ వరల్డ్ టెస్ట్  ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో  టాస్ గెలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. 

టీమిండియాతో పాటు యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం రానేవచ్చింది. పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో ఉన్న టీమిండియా..  ఆ దిశగా సాగేందుకు  గాను ఆస్ట్రేలియాతో  డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నది.  ఇంగ్లాండ్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  టీమిండియా సారథి  రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. హిట్‌మ్యాన్ మరో ఆలోచన లేకుండా ముందుగా  బౌలింగ్ ఎంచుకున్నాడు.  

ఈ మ్యాచ్ లో తుది కూర్పుపై చివరిదాకా ఎలాంటి  అప్డేట్ ఇవ్వని  టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ఆఖరికి అశ్విన్ కు షాకిచ్చాడు.  ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాను పక్కనబెట్టిన  రోహిత్..  తుది జట్టులో రవీంద్ర జడేజాకు చోటు కల్పించి నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగుతున్నాడు. 

వికెట్ కీపర్ల విషయంలోనూ ఇషాన్ కిషన్ - కెఎస్ భరత్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అవకాశమిచ్చిన కెఎస్ భరత్ కే మరో ఛాన్స్ ఇచ్చింది. దీంతో  ఇషాన్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఆసీస్ కూడా హెజిల్‌వుడ్ స్థానంలో  మైఖెల్ నెసర్ ను ఎంపిక చేసినా తుది జట్టులో మాత్రం స్కాట్ బొలాండ్ కే ఛాన్స్ ఇచ్చింది. 

 

Playing XIs for the Final 👀

📝: https://t.co/5IR0QKx6Pf pic.twitter.com/ngDIAC8HG7

— ICC (@ICC)

తుది జట్లు : 

భారత్:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్,  రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బొలాండ్ 

ఇలా చూడండి : 

ఈ మ్యాచ్‌లు స్టార్ నెట్వర్క్ ఛానెల్స్ (స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌స్పోర్ట్స్‌ 2, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ)లో ప్రసారమవుతున్నాయి.. హిందీ, ఇంగ్లీష్ లతో పాటు  తెలుగు, తమిళం, కన్నడ లలో కూడా మ్యాచ్ ను వీక్షించొచ్చు. మొబైల్ ద్వారా చూడాలనుకునేవారికి ఫైనల్స్ మ్యాచ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  ప్రసారమవుతున్నది.

click me!