ఐపీఎల్ జరగొచ్చేమో.., అది మ్యాజిక్.. పీటర్సన్ తో రోహిత్...

By telugu news teamFirst Published Mar 27, 2020, 10:54 AM IST
Highlights

ఎప్పుడూ కామెంట్రీతో బిజీగా ఉండే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భాల్లో ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసే పీటర్సన్.. ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవడంతో బోర్‌గా ఫీలయ్యాడేమో. అందుకే గురువారం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూ చేశాడు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఈ కరోనా కారణంగానే ఐపీఎల్ వాయిదా పడింది. మొత్తం క్రీడా ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. ఎక్కడికక్కడ జరగాల్సిన ఆటలన్నీ ఆగిపోయాయి. క్రీడాకారులంతా సెల్ఫ్ క్వారంటైన్ ఫాలో అవుతున్నారు. ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఈ నేపథ్యంలో... చాలా మంది ఆటగాళ్లు ఈ దొరికిన సమయాన్ని తమ కుటుంబసభ్యులతో గడపడుతూ కాలక్షేపం చేస్తున్నారు. దానితోపాటు.. సోషల్ మీడియాలో గడుపుతూ అభిమానులకు మరింత చేరువౌతున్నారు. తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఎప్పుడూ కామెంట్రీతో బిజీగా ఉండే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భాల్లో ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసే పీటర్సన్.. ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవడంతో బోర్‌గా ఫీలయ్యాడేమో. అందుకే గురువారం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూ చేశాడు.

Also Read నాన్నతో చాహల్ తొలి టిక్ టాక్... నెట్టింట జోక్స్...

ఈ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఐపీఎల్ గురించి చర్చించారు. కరోనాతో ఐపీఎల్ వాయిదా పడిందనే విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించగా... పరిస్థితి మెరుగుపడ్డాక.. ఐపీఎల్ జరగొచ్చేమో.. ఎవరికి తెలుసు అంటూ రోహిత్ సమాధానం ఇచ్చాడు.

ఐపిఎల్ 2020 మార్చి 29 న ప్రారంభం కావాల్సి ఉంది, అయితే ఈ నెల మొదట్లో, ముందుజాగ్రత్త చర్యగా టోర్నమెంట్‌ను ఏప్రిల్ 15 కి వాయిదా వేయాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది.
 
రోహిత్ కెప్టెన్ గా వ్యవిహరించిన ముంబయి ఇండియన్స్ నాలుగు సార్లు ట్రోఫీ గెలుచుకుంది. ఇదే విషయాన్ని పీటర్సన్ గుర్తు చేయగా...  రికీ పాంటింగ్‌తో కలిసి ఫ్రాంచైజీలో గడిపిన సమయం తనకు "మ్యాజిక్" అని చెప్పాడు. రోహిత్ కన్నా ముందుకు ఆ జట్టుకి రికీ పాటింగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

కాగా.. 2011 ప్రపంచకప్ లో తనకు చోటు దక్కనప్పుడు చాలా బాధ కలిగించిందని ఆనాటి సంగతులు రోహిత్ గుర్తు చేసుకున్నాడు. తన సొంత తప్పిదం వల్లే చోటు దక్కలేదని చెప్పాడు.2011 వరల్డ్ కప్ ఫైనల్.. తన సొంతగడ్డ ముంబైలోనే జరిగిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇక ఆ టోర్నీ తర్వాత రోహిత్ కెరీర్ వేగంగా ఎదిగింది. 2015, 2019 వ‌న్డే ప్రపంచ కప్‌లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక గతేడాది జరిగిన టోర్నీలో అయితే 5 శతకాలతో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. మరోవైపు వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా సచిన్‌తో కలిసి పంచుకున్నాడు.

click me!