స్టీవ్ స్మిత్ చూస్తుండగానే షాడో బ్యాటింగ్... రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్...

Published : Jan 18, 2021, 09:02 AM IST
స్టీవ్ స్మిత్ చూస్తుండగానే షాడో బ్యాటింగ్... రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్...

సారాంశం

స్టీవ్ స్మిత్ ఎదుటే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ... మూడో టెస్టులో రిషబ్ పంత్‌కి షాడో బ్యాటింగ్ చేస్తూ దొరికిన స్మిత్... క్రేజీ యాటిట్యూడ్‌తో స్మిత్‌ను ట్రోల్ చేసిన ‘హిట్ మ్యాన్’

‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్‌తో భారత క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. క్రికెట్ మైదానంలో క్రేజీ పనులు చేయడం విరాట్ కోహ్లీకి బాగా అలవాటు. కోహ్లీ గైర్హజరీతో వాటిని మిస్ అయిన వారికి, రోహిత్ తన చిలిపి, క్రేజీ యాటిట్యూడ్‌తో ఆ లోటు తీరుస్తున్నాడు. 

మూడో టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టీవ్ స్మిత్ షాడో బ్యాటింగ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. స్మిత్, రిషబ్ పంత్ లేనప్పుడు షాడో బ్యాటింగ్ చేస్తే, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను చూస్తుండగానే షాడో బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ.

రోహిత్ చేస్తున్న పని చూసిన స్మిత్, ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు వార్నర్ అవుటైన తర్వాత అవుట్ అంటూ అంపర్‌తో కలిసి చెయ్యి పైకెత్తాడు రోహిత్ శర్మ.

అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌లో మాథ్యూ వైడ్‌పై షాట్స్ ఆడాడు రోహిత్ శర్మ. మూడో టెస్టులో విహారిపై షాట్లు ఆడడమే కాకుండా, అదే ప్లేస్‌లో ఫీల్డింగ్ చేస్తూ అశ్విన్, వైడ్‌లను భయపెట్టాలని చూశాడు వైడ్. అతనికి సరైన సమాధానం చెప్పాడు రోహిత్.

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన