ప్రేమించిన వారిని గట్టిగా పట్టుకొని.. భార్య ఫోటోతో రోహిత్ ఎమోషనల్ మెసేజ్..!

Published : Aug 18, 2021, 10:00 AM IST
ప్రేమించిన వారిని గట్టిగా పట్టుకొని..  భార్య ఫోటోతో రోహిత్ ఎమోషనల్ మెసేజ్..!

సారాంశం

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా.. తన భార్య రితికాతో సరదాగా గడుపుతున్నారు. వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోని తాజాగా ఆయన షేర్ చేశారు.

లార్డ్స్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని.. ఇండియన్ క్రికెటర్లంతా ఆస్వాదిస్తున్నారు. మూడో టెస్టు మొదలయ్యే సమయంలో... తమ కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కాగా..  టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా.. తన భార్య రితికాతో సరదాగా గడుపుతున్నారు. వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోని తాజాగా ఆయన షేర్ చేశారు.

ఆ సెల్ఫీ ఫోటోని షేర్ చేసిన రోహిత్ శర్మ.. దానికి ఎమోషనల్ మెసేజ్ క్యాప్షన్ గా ఇచ్చారు. ‘ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు.. మనల్ని.. మనం ప్రేమించిన వారికి గట్టిగా పట్టుకునేలా చేస్తున్నాయి.’ అంటూ క్యాప్షన్ షేర్ చేశారు.

కాగా.. ఈ ఫోటో రోహిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకి లక్షల్లో లైకుల వర్షం కురవగా.. వేలల్లో కామెంట్స్  వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా... లార్డ్స్ లో రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 1-0 తో భారత్ ఆధిక్యం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ లో.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రోహిత్.. కేఎల్ రాహుల్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ ఓపెనర్లుగా.. బరిలోకి దిగగా.. ఇద్దరూ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 83 పరుగులు చేయగా.. రాహుల్ తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !