అయ్యే రోహిత్ శ‌ర్మ‌.. క్యాచ్ ప‌ట్టబోతే ప్యాంట్ జారిపాయే.. ఏం చేసేది.. ! వీడియో

By Mahesh Rajamoni  |  First Published Apr 14, 2024, 11:48 PM IST

Rohit Sharma Oops Moment : చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ స‌మ‌యంలో రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను వదిలిపెట్టాడు. అయితే, ఈ సమయంలో రోహిత్ ప్యాంట్ కూడా కొద్దిగా జారిపోయింది. దీంతో రోహిత్ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.
 


Rohit Sharma Oops Moment video : చెన్నైతో జ‌రిగిన మ్యాచ్ లో ముంబై జ‌ట్టు ఓడిపోయినా హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. ఇదే స‌మ‌యంలో ఫీల్డిండ్ చేస్తున్న స‌మ‌యంలో రోహిత్ కు సంబంధించిన కొన్ని ఊప్స్ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. క్యాచ్ ప‌ట్టే స‌మ‌యంలో అది మిస్ కావ‌డంతో పాటు రోహిత్ శ‌ర్మ ప్యాంట్ కాస్తా జారిపోయింది.. దీంతో అయ్యే రోహిత్ క్యాచ్ పాయే.. ప్యాంట్ జారిపాయే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానుల వినోదాన్ని రెట్టింపు చేసే క్రికెట్ మ్యాచ్‌లలో ఇలాంటి కొన్ని సంఘటనలు తరచుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అభిమానులు సెక్యూరిటీని బ్రేక్ చేయ‌డం, తమ అభిమాన క్రికెట‌ర్ల‌ను క‌ల‌వ‌డం, కొన్నిసార్లు క్రికెటర్లు మిడ్-ఫీల్డ్ డ్యాన్స్ స్టెప్పులు వేసి అభిమానులను అలరిస్తుంటారు. ఇదే త‌ర‌హాలో ఐపీఎల్ 2024 29వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ vs చెన్నై సూప‌ర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ప్యాంట్ జారిపోయిన దృశ్యాలు షాక్ గురిచేసినా.. అభిమానులు నవ్వు ఆపుకోలేకపోయారు.

Latest Videos

KKR vs LSG Highlights : ఫిలిప్ సాల్ట్ తుఫానీ ఇన్నింగ్స్.. ల‌క్నో పై కోల్‌కతా సూప‌ర్ విక్ట‌రీ

ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది, ఇందులో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇదేంది రా సామి ఇలా జ‌రిగింది అనేలా ఆ ఘ‌ట‌న ఉండ‌టం గ‌మ‌నార్హం. రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే ప్రయత్నంలో రోహిత్ ప్యాంటు జారిపోవడంతో స్టేడియం మొత్తం ఈ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు.  12వ ఓవర్ నాల్గో బంతికి డీప్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు గైక్వాడ్.. బౌండరీ దగ్గర నిలబడి రోహిత్ డైవింగ్ ద్వారా క్యాచ్ ప‌ట్టుకోవ‌డానికి ప్రయత్నించాడు, కానీ బంతి చేతిలో నుంచి జారిపోయింది. ఈ క్రమంలో రోహిత్ డైవ్ చేయగా, అతని ప్యాంట్ కొద్దిగా జారిపోయింది, రోహిత్ ఒక చేత్తో బంతిని పట్టుకుని, మరో చేత్తో ప్యాంట్ ను పైకి లాక్కోవ‌డం క‌నిపించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

 

#MIvCSK#rohit pic.twitter.com/ehAng6vlaf

— SANJU GAMING (@SANJUGA33389283)

 

కాగా, రోహిత్  వ‌దిలిపెట్టిన లైఫ్ క్యాచ్‌ను రుతురాజ్ గైక్వాడ్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. గైక్వాడ్ 40 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబే అజేయంగా 66 పరుగులు కొట్టాడు. ధోనీ చివరి ఓవర్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు కేవలం 4 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేశాడు. ధోనీ ఇన్నింగ్స్‌లో మొత్తం 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో మహి స్ట్రైక్ రేట్ 500. ఇప్పుడు ఈ 20 ప‌రుగులే చెన్నైకి విజ‌యాన్ని అందించాయి. 

ధోని సిక్స‌ర్ల సునామీ.. ఉన్నంత సేపు దుమ్మురేపాడు ! ఏం ఆట బాసు అదిరిపోయింది

click me!