IPL 2024, KKR vs LSG Highlights : ఐపీఎల్ 2024 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ప్రస్తుత సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతాకు ఇది నాలుగో విజయం. మరోవైపు ఆరు మ్యాచ్‌ల్లో లక్నోకు ఇది మూడో ఓటమి.
IPL 2024, KKR vs LSG Highlights : ఫిలిప్ సాల్ట్ తుఫానీ ఇన్నింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 లో మరో విజయం అందుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఆదివారం (ఏప్రిల్ 14) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 162 పరుగుల విజయ లక్ష్యాన్ని 16వ ఓవర్‌లోనే ఛేదించింది. ఈ సీజన్ లో లక్నోపై కోల్‌కతాకు ఇదే తొలి విజయం. అయితే, అంతకుముందు లక్నోతో గత చివరి మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ తుఫానీ సూపర్ ఇన్నింగ్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ కు సునాయాస విజయం అందించాడు. సాల్ట్ 47 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సాల్ట్‌కు సపోర్ట్ అందించాడు. శ్రేయాస్ 100 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 38 పరుగులు తో చివరి వరకు క్రీజులో ఉన్నారు. తన ఇన్నింగ్స్ లో శ్రేయాస్ ఆరు ఫోర్లు బాదాడు. శ్రేయాస్-సాల్ట్ మధ్య మూడో వికెట్‌కు అజేయంగా 120 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఈ భాగస్వామ్యం లక్నో నుంచి మ్యాచ్ ను దూరం చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతాకు ఐదు మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం. మరోవైపు ఆరు మ్యాచ్‌ల్లో లక్నోకు ఇది మూడో ఓటమి.
Notun bochorer shubh aarombho! 😇 pic.twitter.com/mgy1hNJkhZ
— KolkataKnightRiders (@KKRiders)సంక్షిప్త స్కోర్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ : (162/2, 15.4 ఓవర్లు)
లక్నో సూపర్ జెయింట్స్ : (161/7, 20 ఓవర్లు)
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. లక్నో తరఫున నికోలస్ పురాన్ అత్యధికంగా 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పూరన్ తన ఇన్నింగ్స్‌లో 32 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. కేఎల్ రాహుల్ 39 పరుగులు (27 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుష్ బదోని 29 పరుగులు (27 బంతులు, 2 ఫోర్లు, ఒక సిక్స్) అందించారు. కోల్‌కతా తరఫున మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్, వైభవ్ అరోరా, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.
Our 𝐒𝐓𝐀𝐑𝐂 factor 🌟🤌 pic.twitter.com/sVmnlIv5MC
— KolkataKnightRiders (@KKRiders)
PBKS vs RR Highlights : తీరుమారని పంజాబ్.. కింగ్స్ ను దెబ్బకొట్టిన రాయల్స్..