టీ20 సిరీస్ లో టీమిండియా తొలి విజయం... రోహిత్ రియాక్షన్ ఇదే...!

By telugu news teamFirst Published Sep 24, 2022, 9:41 AM IST
Highlights

 రోహిత్ శర్మ.... పంత్ ని కాకుండా.. దినేష్ కార్తీక్ ని దింపాడు. దినేష్ కార్తీక్ కూడా అదరగొట్టడంతో... చివరకు విజయం దక్కింది. ఇలా పంత్ ని కాకుండా.. దినేష్ కార్తీక్ ని దింపి రోహిత్ శర్మ మంచి పని చేశాడంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో.. టీమిండియా తొలి విజయం అందుకుంది. తొలి మ్యాచ్ ని ఆస్ట్రేలియా గెలుచుకోగా... రెండో మ్యాచ్ టీమిండియా గెలిచి సమం చేసింది. ఈ మ్యాచ్ విజయంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా... ఈ విజయం పట్ల రోహిత్ శర్మ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

నిజానికి మ్యాచ్ విజయానికి రోహిత్ శర్మ చాలా కష్టపడ్డాడు. అయితే... ఆఖర్లో వరసగా టీమిండియా వరసగా వికెట్లు కోల్పోవడంతో... అందరూ టెన్షన్ పడ్డారు. ఈ మ్యాచ్ కూడా చేజారిపోతుందా అని కంగారు పడ్డారు. కానీ.. ఆ సమయంలో రోహిత్ శర్మ.... పంత్ ని కాకుండా.. దినేష్ కార్తీక్ ని దింపాడు. దినేష్ కార్తీక్ కూడా అదరగొట్టడంతో... చివరకు విజయం దక్కింది. ఇలా పంత్ ని కాకుండా.. దినేష్ కార్తీక్ ని దింపి రోహిత్ శర్మ మంచి పని చేశాడంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా... ఈ విషయం పై తాజాగా రోహిత్ శర్మ కూడా స్పందించాడు.

‘‘హార్దిక్ ఔట్ కావడంతో.... చివరి ఓవర్లో పంత్ లేదంటే.. కార్తీక్ ని దింపాలో చాలా సేపు ఆలోచించాను. కానీ.. చివరకు దినేష్ కార్తీక్ ని పంపించాడు. ఈ మ్యాచ్ లో ఫినిషర్ గా కార్తీక్ ఉపయెగపడ్డాడు. ఈ సమయంలో పంత్ కన్నా...కార్తీక్ అవసరం అని పించింది.అందుకే.... పంత్ ని కాకుండా... కార్తీక్ ని బ్యాటింగ్ చేయమని చెప్పాను. ఈ విషయంలో నేను పూర్తిగా క్లారిటీతో ఉన్నాను’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

ఇక మ్యాచ్ లో తన ఆట చూసి తానే సర్ ప్రైజ్ అయ్యానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్నానని అది ఈ మ్యాచ తో తీరిందని చెప్పాడు. ఈ మ్యాచ్ లో పరుగులకన్నా.. బౌండరీలు, సిక్స్ లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు చెప్పాడు. 


 


 

click me!