టీమిండియాలో కాపీ క్యాట్స్... విరాట్ బ్యాటింగ్‌ను ఇమిటేట్ చేసిన రోహిత్ శర్మ, జడ్డూ సెలబ్రేషన్స్‌ని...

Published : Mar 05, 2022, 04:25 PM IST
టీమిండియాలో కాపీ క్యాట్స్... విరాట్ బ్యాటింగ్‌ను ఇమిటేట్ చేసిన రోహిత్ శర్మ, జడ్డూ సెలబ్రేషన్స్‌ని...

సారాంశం

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో మాజీ కెప్టెన్‌ బ్యాటింగ్‌ని ఇమిటేట్ చేస్తూ కనిపించిన రోహిత్ శర్మ... రవీంద్ర జడేజా సెంచరీ సెలబ్రేషన్స్‌కి తోడైన మహ్మద్ సిరాజ్...

ఒక్కో ప్లేయర్‌కి ఒక్కో ప్రత్యేకమైన బ్యాటింగ్ స్టైల్, బౌలింగ్ స్టైల్, సెలబ్రేషన్స్ ఉంటాయి. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ప్లేయర్లు, పూర్తి జాలీ మూడ్‌తో బరిలో దిగారు. అందుకే టీమిండియాలో కాపీ క్యాట్లు ఎక్కువైపోయారని అంటున్నారు నెటిజన్లు...

టెస్టు సారథిగా తొలి టెస్టు ఆడుతున్న రోహిత్ శర్మ, 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరగుులు చేసి అవుటైన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా ఆడే తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నుంచి ఓ సెంచరీ లేదా డబుల్ సెంచరీ వస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది...

క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలు బాదుతూ దూకుడుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ, లహీరు కుమార బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన తర్వాత కూడా స్వీప్ షాట్ ఆడబోయి లక్మల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

డ్రెస్సింగ్ రూమ్ చేరిన తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాజీ కెప్టెన్ బ్యాటింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ కనిపించాడు రోహిత్ శర్మ. కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య సంబంధాలు సరిగా లేవని వార్తలు వినిపించాయి... అయితే అవన్నీ ఉట్టి పుకార్లేనని తేలిపోయింది...

కెప్టెన్‌గా తొలి టెస్టు ఆడుతున్న రోహిత్ శర్మ, 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీని ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించాడు. అప్పటికే క్రీజులోకి వచ్చిన విరాట్‌ను వెనక్కి వెళ్లాల్సిందిగా కోరిన రోహిత్ శర్మ, ‘గార్డ్ ఆఫ్ హానర్’తో సాదరంగా ఆహ్వానించాడు...

ప్లేయర్ల మధ్యలో నుంచి అభివాదం చేస్తూ పరుగెత్తుకుంటూ వచ్చిన విరాట్ కోహ్లీ, తనను గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించిన రోహిత్ శర్మకు ధన్యవాదాలు తెలిపాడు....

 

టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజా, బ్యాటును కత్తిలా తిప్పుతూ తన స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సమయంలో పెవిలియన్‌లో వాటర్ బాటిల్స్‌ను పట్టుకుని నిల్చున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్... వాటిని కత్తిలా తిప్పుతూ జడ్డూని ఇమిటేట్ చేశాడు...

స్వదేశంలో అది కూడా పెద్దగా ఫామ్‌లో లేని శ్రీలంక జట్టుతో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు, చాలా సరదగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదీ కాకుండా అటు బ్యాటింగ్‌లో ప్రతీ ఒక్కరూ కాస్తో కూస్తో రాణించడంతో భారత జట్టులో నూతన ఉత్సహాలు కనిపిస్తున్నాయి.

తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు చేసిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు రోహిత్ శర్మ... అయితే రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి రవీంద్ర జడేజా 175 పరుగుల తేడాతో డబుల్ సెంచరీకి చేరువగా ఉండడంతో ట్రోల్స్ వస్తున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !