మ్యాచ్ మధ్యలో ఆ పని కానిచ్చేసిన రోహిత్ శర్మ... వీడియోలకు చిక్కడంతో...

Published : Mar 15, 2021, 03:19 PM IST
మ్యాచ్ మధ్యలో ఆ పని కానిచ్చేసిన రోహిత్ శర్మ... వీడియోలకు చిక్కడంతో...

సారాంశం

మ్యాచ్ మధ్యలో ఏదో ఆరగిస్తూ వీడియోకి చిక్కిన రోహిత్ శర్మ... రోహిత్ శర్మను పక్కనబెట్టడానికి ఇదే కారణమంటూ విరాట్ ఫ్యాన్స్ ట్రోలింగ్...  

రోహిత్ శర్మకు మొదటి రెండు టీ20ల నుంచి విశ్రాంతి కల్పించింది టీమిండియా. అతని స్థానంలో తొలి టీ20లో శిఖర్ ధావన్ ఆడగా, రెండో టీ20లో ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అయితే రెండో టీ20 జరుగుతున్న సమయంలో పెవిలియన్‌లో సైలెంట్‌గా ఏదో ఆరగిస్తూ కనిపించాడు రోహిత్ శర్మ...

కోచ్ రవిశాస్త్రి, సపోర్టింగ్ స్టాఫ్ వెనకాల కూర్చున్న రవిశాస్త్రి... కెమెరాలకు కనిపించకుండా ఏదో దాచుకుని తినడం టీవీల్లో కనిపించింది. దీంతో ‘రోహిత్ లవ్ ఫర్ వడాపావ్’ అంటూ హిట్ మ్యాన్‌ను ట్రోల్ చేస్తున్నారు విరాట్ ఫ్యాన్స్.

అయితే టెస్టు సిరీస్ విజయంలో రోహిత్ శర్మకు ఎక్కువ క్రెడిట్ దక్కిందనే అక్కసుతో అతడిని రెండు మ్యాచులకు విరాట్ పక్కనపెట్టాడని ఆరోపిస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్... విరాట్, రోహిత్ తమ మధ్య ఎలాంటి వైరం లేదని టెస్టు సిరీస్ సమయంలో నిరూపించినా, ఫ్యాన్స్ మధ్య మాత్రం గొడవలు తప్పడం లేదు.
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది