టీ20 ప్రపంచ కప్ కు ముందే రోహిత్ చేతికి కెప్టెన్సీ...: యువీ సంచలనం

By Arun Kumar PFirst Published Sep 27, 2019, 3:39 PM IST
Highlights

టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోోహిత్ శర్మల మధ్య విభేదాలున్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అలాగే కోహ్లీ ని పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించి రోహిత్ కు అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

ఐసిసి వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాభవం కాస్త తగ్గిందనే చెప్పాలి. ఈ మెగా టోర్నీకి ముందువరకు కోహ్లీని గొప్ప కెప్టెన్ అంటూ ప్రశంసించిన వారే టీమిండియా అర్థాంతంగా వెనుదిరగడంతో అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ నుండి పరిమిత ఓవర్ల పార్మాట్ కెప్టెన్సీ పగ్గాలను తీసుకుని రోహిత్ కు అప్పగించాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కు మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుండి మద్దతు లభిస్తోంది. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

''వరుస సీరీసుల్లో తీరిక లేకుండా పాల్గొంటే సాధారణ ఆటగాళ్లపై తీవ్ర పని ఒత్తిడి పడుతుంది. అలాంటిది కెప్టెన్ పై అయితే ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా వుంటుంది. అదే అంతర్జాతీయ స్థాయిలోని మూడు క్రికెట్ ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ వుంటే అతడిపై మరింత ఎక్కువగా పనిభారం వుంటుంది. ఆ ఒత్తిడి అతడి వ్యక్తిగత ఆటతీరుపై ప్రభావం  చూపిస్తుంది. 

సరిగ్గా ఇదే కోహ్లీ విషయంలో జరుగుతోంది. అతడు విదేశీ, స్వదేశీ సీరిసుల్లో తీరికిలేకుండా బిజీ బిజీగా పాల్గొంటున్నాడు. దీంతో వర్క్ లోడ్ ఎక్కవై సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఓసారి ఆలోచిస్తే మంచిది. నిజంగానే అతడిపై పని ఒత్తిడి ఎక్కువగా వుందనుకుంటే కేవల టెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కొనసాగించాలి. పరిమత ఓవర్ల ఫార్మాట్లకు రోహిత్ శర్మ ను  కెప్టెన్ గా నియమిస్తే భావుంటుంది.  

ఐపిఎల్  లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ సత్తా బయటపడింది. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో కోహ్లీ జట్టుకు దూరమైనపుడు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులోనూ టీమిండియా మంచి విజయాలను నమోదుచేసుకుంది. ఇక ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు కెప్టెన్సీలో మార్పు జరిగితే బావుటుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలి. 

కేవలం కోహ్లీపైప వర్క్ లోడ్ ఎక్కువవుతుందని అనుకుంటేనే మేనేజ్‌మెంట్ కోహ్లీని పక్కకుతప్పించాలి. అలాకాదని ఎవరో అతడిని ఎవరో విమర్శించడాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవద్దు. నిజంగా చెప్పాలంటే కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే కాదు అత్యుత్తమ కెప్టెన్ కూడా. కేవలం అతడిపై పని ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశ్యంతోనే టీమిండియా మేనేజ్‌మెంట్ కు నేనీ సూచనలిస్తున్నా.'' అని యువీ పేర్కొన్నాడు. 

click me!