విశాఖలో సెంచరీ...రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్

By telugu team  |  First Published Dec 19, 2019, 8:13 AM IST

ఈ ఏడాది మొదట్లో రోహిత్ శర్మ ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఐదు శతకాలు తన జాబితాలో వేసుకున్నాడు. ఒక సింగిల్ టోర్నమెంట్ లో 500లకు పైగా పరుగులు చేసిన ఘనత కేవలం రోహిత్ కి మాత్రమే దక్కడం విశేషం. 


విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 159 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

వన్డేల్లో 150కిపైగా స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ వన్డేల్లో 8 సార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌(6) రెండో స్థానంలో ఉండగా, సచిన్‌ టెండూల్కర్‌, క్రిస్‌గేల్‌(5సార్లు)లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

Latest Videos

undefined

అంతేకాదు.... కేవలం ఈ సంవత్సరం రోహిత్ శర్మ ఏడు సెంచరీలు చేశాడు.  ఈ ఏడాది ఇప్పటి వరకు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో రోహిత్ శర్మ 1382 పరగులు చేయగా.... కెప్టెన్ విరాట్ కోహ్లీ 1292 పరుగులు చేశాడు.  

ఈ ఏడాది మొదట్లో రోహిత్ శర్మ ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఐదు శతకాలు తన జాబితాలో వేసుకున్నాడు. ఒక సింగిల్ టోర్నమెంట్ లో 500లకు పైగా పరుగులు చేసిన ఘనత కేవలం రోహిత్ కి మాత్రమే దక్కడం విశేషం. 

అంతేకాదు... నిన్నటి మ్యాచ్ తో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. ఒక ఇంటర్నేషనల్ ఇయర్‌లో 10 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్‌లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(9-1998) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ(7-2000), ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్(7-2016), రోహిత్ శర్మ(7-2019)లు సంయక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

click me!