కూతురు ముందు ఐపిఎల్ ట్రోఫీ అందుకోవడం ఎలావుంది...?: భార్య ప్రశ్నకు రోహిత్ జవాబిదే (వీడియో)

Published : May 13, 2019, 05:08 PM IST
కూతురు ముందు ఐపిఎల్ ట్రోఫీ అందుకోవడం ఎలావుంది...?: భార్య ప్రశ్నకు రోహిత్ జవాబిదే (వీడియో)

సారాంశం

హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది ముంబై ఇండియన్స్  ఐపిఎల్ 2019 విజేతగా అవతరించింది. డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వంటి  బలమైన  జట్టును ఓడించి సత్తా చాటింది. ఇలా ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ లో చెన్నైపై గెలుస్తూ వచ్చిన ముంబై ఫైనల్లోనూ అదే ఊపు కొనసాగించింది. ఇలా టైటిల్ పోరులోనూ పైచేయి సాధించిన ముంబై  నాలుగో ఐపిఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సీజన్ చివరి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకున్న తర్వాత కెప్టెన్ రోహిత్  మైదానంలో తన కూతురు సమైరా, భార్య రితికాలతో  కొద్దిసేపు సందడి చేశాడు.  

ఈ  సందర్భంగా రితిక తన భర్త రోహిత్ ను కాస్సేపు సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె సంధించిన ప్రశ్నలకు రోహిత్ ఆకట్టుకునేలా  జవాబిచ్చాడు. ''కూతురు సమైరా ముందు  నాలుగో ఐపిఎల్ ట్రోఫీ అందుకకోవడం ఎలా వుంది..?'' అనే ప్రశ్నతో రితిక ఇంటర్వ్యూను మొదలుపెట్టింది. '' ఇది చాలా స్పెషల్. కేవలం సమైరా ముందే కాదు  నీ ముందు కూడా ఐపిఎల్ ట్రోఫిని అందుకోవడం  ఇదే మొదటిసారి. ఇప్పటికే సమైరా తాను ఆడిన చాలా మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించింది. మరోసారి ఇలా విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా  వుంది.'' అంటూ భార్య ప్రశ్నకు రోహిత్ జవాబిచ్చాడు. 

''మలింగ వేసిన లాస్ట్ ఓవర్ సమయంలో నీ పరిస్థితి  ఏంటి..? ఆ ఒత్తిడిని తట్టుకోలేక నేను ఆ ఓవర్ చూడలేకపోయాను'' అంటూ రితిక మరో ప్రశ్న సంధించింది. దీనికి రోహిత్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. '' నీలాగ నేను చూడకుండా వుండలేను. ఎంత ఒత్తిడి వున్నా తప్పకుండా చూడాల్సిందే. 2017 లో కూడా  ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా. అప్పుడు మిచెల్ జాన్సన్ జట్టును గెలిపించగా  ఇప్పుడు మలింగ ఆ పని చేశాడు. '' అని పేర్కొన్నాడు. ఇలా  రోహిత్ దంపతుల మధ్య సంబాషణ ఆసక్తికరంగా సాగింది. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !