ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా రిషబ్ పంత్... ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్‌కి గుర్తుగా...

Published : Feb 08, 2021, 01:58 PM IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా రిషబ్ పంత్... ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్‌కి గుర్తుగా...

సారాంశం

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 245 పరుగులు చేసిన రిషబ్ పంత్... ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు వికెట్ కీపింగ్‌లో నాలుగు వికెట్లు... ఐసీసీ మంత్లీ అవార్డుల్లో మొట్టమొదటి అవార్డు సాధించిన రిషబ్ పంత్, సౌతాఫ్రికా వుమెన్ ప్లేయర్ షబినమ్ ఇస్మాయిల్...

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జనవరి 2021)గా ఎంపికయ్యాడు. గత నెలలో దశాబ్దపు ఉత్తమ క్రికెట్ అవార్డులు ప్రకటించిన ఐసీసీ, ఇకపై ప్రతీ నెలా ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

జనవరి నెలకు సంబంధించిన ప్రదర్శనకు గానూ జో రూట్, రిషబ్ పంత్, పాల్ స్లిర్లింగ్ రేసులో నిలవగా, అత్యధిక ఓట్లు సాధించిన భారత వికెట్ కీపర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 245 పరుగులు చేసి, భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

గబ్బా టెస్టులో చారిత్రక విజయాన్ని అందించిన పంత్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. వికెట్ కీపర్‌గా 4 వికెట్లు తీసిన పంత్, ఐసీసీ మొట్టమొదటి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలిచాడు.

మహిళల విభాగంలో సౌతాఫ్రికా బౌలర్ షబినమ్ ఇస్మాయిల్ ‘వుమన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచింది. మూడు వన్డేలాడిన షబినమ్ 7 వికెట్లు తీసింది. 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే