
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 257/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 337 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఏడో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
91 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో కలిసి 31 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, జాక్ లీచ్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షాబర్ నదీమ్ డకౌట్, ఇశాంత్ శర్మ 4, బుమ్రా డకౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా బౌండరీలతో బ్యాటింగ్ కొనసాగించిన వాషింగ్టన్ సుందర్ 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
138 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సుందర్, సెంచరీని మిస్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డొమినిక్ బెస్ నాలుగు వికెట్లు తీయగా, జాక్ లీచ్, అండర్సన్, జోఫ్రా ఆర్చర్ రెండేసి వికెట్లు తీశారు.