ధోనీ ఫ్యామిలీతో రిషబ్ పంత్... ఫోటోలు వైరల్

Published : Jan 27, 2021, 07:51 AM ISTUpdated : Jan 27, 2021, 08:33 AM IST
ధోనీ ఫ్యామిలీతో రిషబ్ పంత్... ఫోటోలు వైరల్

సారాంశం

వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో... ఈ కొద్ది గ్యాప్ లో పంత్ చిల్ అవుతున్నాడు. అది కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీతో చిల్ అవుతుండటం గమనార్హం.

టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఆస్ట్రేలియా టూర్ లో  రెచ్చిపోయాడు. అప్పటి వరకు ఆట సరిగా ఆడలేకపోయానని విమర్శల పాలైన పంత్.. బ్రిస్బేన్ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. దీంతో.. ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆసీస్ విజయానికి కళ్లెం వేసి.. భారత్ విజయతీరాలకు చేరేలా సహకరించాడు. కాగా.. త్వరలోనే స్వదేశంలో టీమిండియా  ఇంగ్లాండ్ తో తలపడనుంది. 

వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో... ఈ కొద్ది గ్యాప్ లో పంత్ చిల్ అవుతున్నాడు. అది కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీతో చిల్ అవుతుండటం గమనార్హం.

మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి తో కలిసి పంత్ ఎంజాయ్ చేస్తున్నాడు. ధోని భార్య సాక్షి ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటోలో ధోని గ్రీన్‌ క్యాప్‌ను ధరించగా.. సాక్షి అతని పక్కనే నిల్చుని వీడియో కాల్‌తో బిజీ అయిపోయారు. వారిద్దరి వెనకాల నిల్చున్న పంత్‌ వీడియోకాల్‌ను ఎంజాయ్‌ చేస్తూ తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు.

కాగా... దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!
IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..