ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నా.. త్వరలోనే టీమిండియాలోకి వస్తా.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన పంత్

Published : Mar 01, 2023, 11:40 AM IST
ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నా.. త్వరలోనే టీమిండియాలోకి వస్తా.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన పంత్

సారాంశం

Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్  రిషభ్ పంత్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.   తాను త్వరగా కోలుకుంటున్నానని.. కొద్దిరోజుల్లోనే భారత జట్టుతో కలుస్తానని చెప్పుకొచ్చాడు. 

గతేడాది డిసెంబర్ 30న ఢీల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్లూ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన  రిషభ్ పంత్  వేగంగా కోలుకుంటున్నాడు.  ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్.. తాను క్రికెట్ ను చాలా మిస్ అవుతున్నానని  త్వరలోనే భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.   ఆస్పత్రిలోనే ఉన్న పంత్.. ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు.  యాక్సిడెంట్ అయ్యాక  పంత్ ఒక మీడియా సంస్థతో మాట్లాడటం ఇదే తొలిసారి.  

రిషభ్ మాట్లాడుతూ... ‘నేను ఇప్పుడు బాగానే ఉన్నా.  వేగంగా కోలుకుంటున్నా.  దేవుడి దయ, వైద్య సిబ్బంది  మద్దతు వల్ల  నేను త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తా..’అని చెప్పాడు. 

తన చుట్టూ జరుగుతున్నదానిగురించి తాను పట్టించుకోవడం లేదని.. కానీ  తాను మాత్రం నిత్యం ఫ్రెష్ గా ఉండేందుకు  యత్నిస్తున్నాని  పంత్ చెప్పుకొచ్చాడు.  ‘నా చుట్టూ  పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఉంది.  కానీ నేను మాత్రం నా జీవితాన్ని ఎలా చూస్తాననేదానిపైనే   దృష్టిసారించా.  రోడ్డు ప్రమాదం  తర్వాత నా జీవితంలో  చాలా మార్పులొచ్చాయి.  ఆస్వాదించాలే గానీ చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందం ఉంది.  నా వరకైతే  రోజూ పళ్లు తోముకోవడం, సూర్యుడి ముందు కూర్చోని  సూర్యోదయాన్ని ఆస్వాదించడం ఎంతో బాగుంది. 

పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని వాటి వెనుక పరిగెడుతున్న మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలను మరిచిపోతున్నాం.  ఈ రెండు నెలలుగా నేను అబ్జర్వ్ చేసింది, ఎవరికైనా సందేశం ఇవ్వాలనుకుంటే చెప్పేది  ఏంటంటే.. ప్రతీరోజును మనం ఆనందంగా గడపాలి. మన మార్గంలో వచ్చే ప్రతీ క్షణాన్ని  మనసారా ఆస్వాదించగలగాలి...’అని సూచించాడు. 

 

రోడ్డు ప్రమాదం వల్ల తాను క్రికెట్ ను చాలా మిస్ అవుతున్నానని,  తన జీవితంలో చాలా మట్టుకు క్రికెట్టే ఉందని పంత్ అన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తాను త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత  తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెడతానని అన్నాడు.  దానికోసం ఎక్కువ రోజులు వేచి ఉండలేనని పంత్ తెలిపాడు.  తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు పంత్ కృతజ్ఞతలు  చెబుతూ.. భారత జట్టుకు, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు వారి మద్దతు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నట్టు   తెలిపాడు. మళ్లీ టీమిండియా అభిమానులను అలరించడానికి త్వరలోనే జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?