రిషబ్ పంత్ కూడా అవుట్... ఆరు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...

Published : Jan 17, 2021, 08:57 AM IST
రిషబ్ పంత్ కూడా అవుట్... ఆరు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...

సారాంశం

38 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్... 23 పరుగులు చేసిన రిషబ్ పంత్...  186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా... హజల్‌వుడ్‌కి మూడు వికెట్లు...

గబ్బా టెస్టులో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు. 75 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, లంచ్ బ్రేక్ తర్వాత రెండో బంతికే అవుట్ అయ్యాడు. హజల్‌వుడ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు మయాంక్.

ఆ తర్వాత 29 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన రిషబ్ పంత్ కూడా హజల్‌వుడ్ బౌలింగ్‌లోనే కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆస్ట్రేలియాలో వరుసగా 10 ఇన్నింగ్స్‌ల్లో 25+ స్కోరు చేసిన రిషబ్ పంత్, ఆ రికార్డును 2 పరుగుల దూరంలో కోల్పోయాడు.  

శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ కలిసి స్కోరు బోర్డుని 200 పరుగులు దాటించారు. అయినా ఇప్పటికీ ఆసీస్ స్కోరుకి 168 పరుగుల దూరంలో ఉంది టీమిండియా. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే