మళ్లీ అదే ఆట... పంత్ పై నెటిజన్ల ట్రోల్స్..

By telugu teamFirst Published Nov 8, 2019, 12:20 PM IST
Highlights

నిబంధనల ప్రకారం బ్యాట్ మెన్ శరీరం లేదా బ్యాట్ కి తాకని బంతి వికెట్లని దాటి వెనక్కి వచ్చిన తర్వాతే వికెట్ కీపర్ దానిని అందుకోవాలి. క్రీజు పరిధిలో ఉన్నప్పుడు కీపర్ దానిని పట్టుకోకూడదు. 

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. వికెట్ కీపింగ్ విషయంలో నిరాశ పరిచి.. నెటిజన్ల ట్రోల్స్ బారిన పడ్డాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ 20ల్లో పంత్ మరోసారి నిరాశ పరిచాడు.  బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ ని స్టంపపౌట్ చేసే క్రమంలో పంత్ పెద్ద తప్పు చేశాడు.

AlsoRead రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... రాజ్‌కోట్ టీ20లో భారత్ ఘన విజయం...

దీంతో బాల్ ని అంపైర్ నో బాల్ గా ప్రకటించారు. దీంతో... ఓ వికెట్ తీసే అవకాశం కోల్పోయింది. ఆరో ఇన్నింగ్స్ లో చాహల్ బౌలింగ్ లో ఓపెనర్  దాస్ క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. 

అయితే.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా వెనక్కి వెళ్లింది. దీంతో.. బంతిని ఒడిసిపట్టుకున్న పంత్ క్షణాల వ్యవధిలో వికెట్లని గీరాటేశాడు. కానీ.. రిప్లైని పరిశీలించిన అంపైర్ పంత్ తప్పిదం కారణంగా బంతిని నోబాల్‌గా ప్రకటించి బంగ్లాదేశ్‌కి ఫ్రీ హిట్ అవకాశం కల్పించాడు. దీంతో.. దాస్ వికెట్ పడిన ఆనందంలో ఉన్న భారత్‌కి నిరాశ ఎదురైంది.

నిబంధనల ప్రకారం బ్యాట్ మెన్ శరీరం లేదా బ్యాట్ కి తాకని బంతి వికెట్లని దాటి వెనక్కి వచ్చిన తర్వాతే వికెట్ కీపర్ దానిని అందుకోవాలి. క్రీజు పరిధిలో ఉన్నప్పుడు కీపర్ దానిని పట్టుకోకూడదు. 

దాస్‌కి అందని బంతి వికెట్లని దాటక ముందే పంత్ పట్టుకుని స్టంపౌట్ చేశాడు. దీంతో.. అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే.. ఆ తర్వాత రెండు ఓవర్ల వ్యవధిలోనే తెలివిగా లిట్టన్ దాస్‌ని స్టంపౌట్ చేయడం ద్వారా పంత్ తన తప్పిదాన్ని దిద్దుకున్నాడు. అయితే.. కీపర్‌గా ప్రాథమిక నియమాన్ని ఉల్లఘించిన పంత్‌పై సోషల్ మీడియాలో అభిమానులు చురకలేస్తున్నారు.

ఆట రూల్స్ కూడా తెలియడం లేదా అంటూ ఏకిపారేస్తున్నారు. పంత్ ఆట చూసి ధోనీ ఇలా రియాక్ట్ అవుతాడంటూ కొన్ని కామెడీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా పంత్ ని ట్రోల్ చేస్తున్న మీమ్స్ కనిపించడం గమనార్హం. మొత్తానికి పంత్ మరోసారి బుక్కయ్యాడు. ఇలానే కంటిన్యూ అయితే.. పంత్ కి  అవస్థలు తప్పవు. 

click me!