ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్... గబ్బా టెస్టులో అరుదైన...

Published : Jan 19, 2021, 11:37 AM IST
ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్... గబ్బా టెస్టులో అరుదైన...

సారాంశం

అత్యధిక వేగంగా టెస్టుల్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న భారత వికెట్‌కీపర్‌గా పంత్ రికార్డు... మహేంద్ర సింగ్ ధోనీకి వెనక్కి నెట్టిన రిషబ్ పంత్... అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ అరుదైన ఘనత...

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... ఆస్ట్రేలియాలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారత వికెట్ కీపర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు రిషబ్ పంత్. కెరీర్‌లో 16వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్, 27వ ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయి అందుకోగా, ధోనీకి 32 ఇన్నింగ్స్‌లు కావాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న రిషబ్ పంత్... ఇక్కడ ఆడిన గత 12 ఇన్నింగ్స్‌లో 11 సార్లు 25+ స్కోరు నమోదుచేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ని 2 పరుగుల తేడాతో మిస్ అయినా నాలుగో ఇన్నింగ్స్‌లో 30+ స్కోరు చేశాడు పంత్.

అలాగే ఇదే సిరీస్‌లో టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లలో పాలుపంచుకున్న భారత వికెట్‌కీపర్‌గానూ నిలిచాడు రిషబ్ పంత్. 11 టెస్టుల్లో 22 ఇన్నింగ్స్‌ల్లో 50 మంది బ్యాట్స్‌మెన్లలో అవుట్‌ చేయడంలో పాలు పంచుకున్నాడు పంత్.

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !