రహానే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

Published : Jan 19, 2021, 09:54 AM IST
రహానే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

సారాంశం

24 పరుగులు చేసి అవుటైన అజింకా రహానే... పూజారాతో కలిసి మూడో వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యం... మయాంక్ అగర్వాల్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్...

గబ్బా టెస్టులో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ అజింకా రహానే 22 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రహానే.

167 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా... భారత జట్టు విజయానికి ఇంకా 161 పరుగులు కావాలి. ఛతేశ్వర్ పూజారా 154 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పూజారాని టార్గెట్ చేస్తూ ఆసీస్ బౌలర్లు బంతులు విసురుతున్నారు.

పూజారాకి ఇప్పటికే పలుమార్లు బౌన్సర్లు బలంగా తగిలాయి. అయినా పట్టు వదలకుండా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు పూజారా. మయాంక్ అగర్వాల్ స్థానంలో రిషబ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

T20I Fastest Fifties: భారత్ తరఫున మెరుపు హాఫ్ సెంచరీలు బాదిన టాప్ 5 ప్లేయర్లు వీరే
Abhishek Sharma : ఇదేం బాదుడురా సామీ.. యువీ రికార్డు మిస్.. అభిషేక్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్