INDvsENG: పూజారా, రిషబ్ పంత్ పోరాటం... 150 దాటిన భారత్ స్కోరు...

Published : Feb 07, 2021, 02:22 PM IST
INDvsENG: పూజారా, రిషబ్ పంత్ పోరాటం... 150 దాటిన భారత్ స్కోరు...

సారాంశం

 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ... క్లాస్ ఇన్నింగ్స్‌తో అర్ధశతకం  బాదిన ఛతేశ్వర్ పూజారా... టీ విరామానికి భారత జట్టు స్కోరు 154/4...

71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా, యంగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిషబ్ పంత్ తనదైన స్టైల్‌లో బౌండరీలతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే, ఛతేశ్వర్ పూజారా క్లాస్ టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.

టీ విరామానికి 41 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా... 154  పరుగులు చేసింది.  ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 424 పరుగులు వెనకబడి ఉంది టీమిండియా. రిషబ్ పంత్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూజారా 111 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులతో రిషబ్ పంత్ 44 బంతుల్లో 54 పరుగులతో క్రీజులో ఉన్నారు.

గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో పూజారాకి ఇది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. రిషబ్ పంత్ మెరుపు బ్యాటింగ్ కారణంగా ఐదో వికెట్‌కి ఈ ఇద్దరూ 87 బంతుల్లో 81 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు రోహిత్ శర్మ 6, శుబ్‌మన్ గిల్ 29, విరాట్ కోహ్లీ 11, రహానే 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు.

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?