‘పెద్దాయన రూట్ ఎవరో ఇప్పుడైనా తెలిసిందా...’ అమితాబ్‌కి కౌంటర్ ఇచ్చిన ఆండ్రూ ఫ్లింటాఫ్...

By team teluguFirst Published Feb 7, 2021, 12:12 PM IST
Highlights

2016, మార్చి 27న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ట్వీట్ వేసిన ఆండ్రూ ఫ్లింటాఫ్....

ఇలాగే బ్యాటింగ్ చేస్తే, ఏదో రోజు జో రూట్‌ని అందుకుంటాడని పోస్టు...

విరాట్ కోహ్లీని తక్కువ చేసి ట్వీట్ చేయడంపై అమితాబ్ బచ్చన్ సీరియస్... ఐదేళ్ల తర్వాత రిప్లై ఇచ్చిన ఫ్లింటాఫ్

ఆండ్రూ ఫ్లింటాఫ్... సౌరవ్ గంగూలీ లార్డ్ క్రికెట్ మైదానంలో షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసుకోవడానికి... యువరాజ్ సింగ్ 2007లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడానికి కారణం. తన నోటి దూకుడుతో భారతీయులకు చాలాసార్లు కోప తెప్పించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ మరోసారి సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్ చేశాడు.

ఐదేళ్ల కిందట జో రూట్ గురించి వేసిన ట్వీట్‌కి అమితాబ్ బచ్చన్ ఇచ్చిన కౌంటర్‌తో షాక్ అయిన ఫ్లింటాఫ్... సరైన సమయం కోసం వేచి చూసి ఐదేళ్ల తర్వాత సమాధానం ఇచ్చాడు. ఐదేళ్ల కిందట 2016, మార్చి 27న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఓ ట్వీట్ వేశాడు ఆండ్రూ ఫ్లింటాఫ్.

‘ఇలాగే బ్యాటింగ్ చేస్తే విరాట్ కోహ్లీ కూడా జో రూట్ అంతటి మెరుగైన బ్యాట్స్‌మెన్ అవుతాడు... ఇంగ్లాండ్ ఫైనల్‌లో ఎవరితో పోటీ పడుతుందో తెలీదు’ అంటూ 2016 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ గురించి ట్వీట్ చేశాడు ఫ్లింటాఫ్. అయితే ఈ ట్వీట్‌తో ఫ్లింటాఫ్, భారత సారథి విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడాడని భావించిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్... ‘ఎవరా రూట్... అతన్ని వేళ్లతో సహా పీకి పారేస్తాం...’ అంటూ ఘాటైన సమాధానం ఇచ్చాడు.

With the greatest respect , this aged well 😂 https://t.co/sjhs7HGT1d

— Andrew Flintoff (@flintoff11)

ఈ ట్వీట్‌ను ఇప్పుడు బయటికి తీసిన ఫ్లింటాఫ్... ‘ఎంతో గొప్ప గౌరవంగా... ఈ ట్వీట్ ఇంకా మరచిపోలేదనుకుంటా...’ అంటూ బిగ్‌ బీకి కౌంటర్ ఇచ్చాడు ఫ్లింటాఫ్. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జో రూట్ 218 పరుగులు చేసి, ఇండియాలో ఇండియాపై అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్‌గా నిలిచాడు.

 

click me!