Rishabh Pant: రిషబ్ పంత్ తన సోదరి సాక్షి పంత్ వివాహాంలో డ్యాన్స్ చేస్తూ చాలా సంతోషంగా కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Rishabh Pant sister Sakshi wedding: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని మరోసారి గెలుచుకుని భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. 12 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత జట్టులోని ఆటగాళ్లందరూ ఆనందంగా కనిపించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు టోర్నమెంట్ ముగియడంతో కెప్టెన్ రోహిత్‌తో పాటు మిగిలిన సభ్యులు కూడా తిరిగి దేశానికి చేరుకున్నారు. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ సన్నాహాల కోసం తమ ఫ్రాంచైజీలకు వెళ్లారు, మరికొందరు తమ స్వస్థలాలకు బయలుదేరారు. రిషబ్ పంత్ కూడా తన సోదరి వివాహం కోసం ఇంటికి చేరుకున్నాడు.
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నేరుగా తన సోదరి సాక్షి పంత్ వివాహానికి హాజరయ్యేందుకు ఇంటికి వెళ్ళాడు. ఒకరోజు ముందు అతని ఇంట్లో మెహందీ వేడుక జరిగింది, ఇందులో పంత్ కూడా కనిపించాడు. సాక్షి ఆ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఆమె తన తల్లి, సోదరుడు సహా ఇతర బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. రిషబ్ డాన్స్ తో అదరగొడుతూ చాలా ఉత్సాహంగా స్టెప్పులేశాడు. పంత్, అతని తల్లి కలిసి కూర్చున్న ఫోటో కూడా వైరల్ గా మారింది.
సాక్షి పంత్ రిషబ్ పంత్‌ను ఉద్దేశించి తన స్టోరీలో ఒక లైన్ కూడా రాసింది, "మీ సోదరుడు ఫైనల్ గెలిచి మీ పెళ్లికి వచ్చినప్పుడు" అంటూ డాన్స్ చేస్తున్న వీడియో పెట్టారు. పంత్ చాలా సంతోషంగా ఉండే వ్యక్తి, అతను ఎప్పుడూ నవ్వుతూ, చిరునవ్వుతో కనిపిస్తాడు. అతను క్రికెట్ మైదానంలో కూడా ఆటగాళ్లతో సరదాగా గడుపుతూ కనిపిస్తాడు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఫుల్ హ్యాపీగా కనిపించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఈసారి రిషబ్ పంత్‌కు భారత ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం రాలేదు. కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11లో ఉండగా, పంత్ బెంచ్‌పై కూర్చొని అతను జట్టును ప్రోత్సహించాడు. ఇప్పుడు అతను మార్చి 22 నుండి ప్రారంభమయ్యే IPL 2025లో కనిపించనున్నాడు. ఈసారి పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు, కెప్టెన్ గా పంత్ వేలంలో రికార్డు సాధించిన విషయం తెలిసిందే. జట్టుకు ట్రోఫీ అందిస్తాడని లక్నో అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది.