Rinku Singh: ఎంపీతో రింకూ సింగ్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్

Published : Jun 01, 2025, 11:01 PM IST
Rinku Sing and Priya Saroj

సారాంశం

Rinku Singh: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ జూన్ 8న లక్నోలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇరు కుటుంబాలు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నాయి. 

Rinku Singh to get engaged to MP Priya Saroj: భారత యంగ్  క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాది పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. జూన్ 8 లక్నోలోని ఓ హోటల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరగనుందని సమాచారం. 

రింకూ సింగ్, ప్రియ సరోజ్ మధ్య వివాహ బంధంపై చర్చలు ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమయ్యాయి. జనవరిలో ప్రియా తండ్రి తుఫాని సరోజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు కుటుంబాలూ సమావేశమై వివాహంపై చర్చించాయి. ఇప్పుడు నిశ్చితార్థ కార్యక్రమం జరగనుంది.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన తూఫానీ సరోజ్ మాట్లాడుతూ.. "నిశ్చితార్థ వేడుక సన్నిహితుల మధ్య జరుగుతుంది. ఇందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు" అని తెలిపారు. అలీఘర్‌లో ఇరుకుటుంబాల సమావేశం తర్వాత పరస్పర అంగీకారంతో ఈ వివాహం నిర్ణయమైందని పేర్కొన్నారు.

ఏడాది కాలంగా రింకూ, ప్రియా మధ్య పరిచయం

రింకు, ప్రియా ఒకరినొకరు ఏడాది నుంచి తెలుసుకుంటున్నారు. ఓ స్నేహితుడి పరిచయంతో వారు కలుసుకున్నారు. ఆ స్నేహితుడి తండ్రికీ క్రికెట్ రంగంతో సంబంధముంది. “రింకు, ప్రియా గత ఏడాది నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కానీ కుటుంబాల ఆమోదం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు ఇరుకుటుంబాలూ తమ ఆమోదాన్ని ఇచ్చాయి” అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే, నవంబర్ 18వ తేదీన వారణాసిలో వీరి పెళ్లి జరగనుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

సమాజ్‌వాది పార్టీ కార్యకలాపాల్లో చాలా కాలంగా ప్రియా సరోజ్ చురుకుగా పాల్గొంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మచిలీషహర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2022లో తన తండ్రి తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజల దృష్టిలోకి వచ్చారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ డిగ్రీ, నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు.

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రింకూ సింగ్ ప్రతినిధ్యం వహించిన కోల్ కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు ప్లేఆఫ్‌కు అర్హత పొందలేకపోయింది. ఈ సీజన్‌లో రింకూ మొత్తం 13 మ్యాచ్‌లలో 206 పరుగులు చేశాడు. 29.42 సగటు, 153.73 స్ట్రైక్ రేట్ తో అతని బ్యాటింగ్ సాగింది. కోల్‌కతా 14 మ్యాచ్‌లలో 12 పాయింట్లు మాత్రమే సాధించి, లీగ్ పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వారి నెట్ రన్‌రేట్ -0.305గా ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !