RCBvsMI: కెప్టెన్‌గా 150వ మ్యాచ్... కోహ్లీ కమ్ బ్యాక్ ఇస్తాడా...

Published : Sep 28, 2020, 06:18 PM IST
RCBvsMI: కెప్టెన్‌గా 150వ మ్యాచ్... కోహ్లీ కమ్ బ్యాక్ ఇస్తాడా...

సారాంశం

 టీ20 కెప్టెన్‌గా 150వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ...  భారత జట్టుకు 37 టీ20 మ్యాచుల్లో, ఐపీఎల్ 113 మ్యాచుల్లో కెప్టెన్‌గా విరాట్...  మహేంద్ర సింగ్ ధోనీ, డారెన్ సమీ, గౌతమ్ గంభీర్ తర్వాత ఆ రికార్డు విరాట్‌కే...  

IPL 2020: విరాట్ కోహ్లీ... ఓ దూకుడైన కెప్టెన్. ఓ రన్ మెషిన్. ఓ రికార్డుల రారాజు... క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజులో పరుగుల ప్రవాహం సృష్టించిన బ్యాట్స్‌మెన్. వన్డేలు, టెస్టులు, టీ20లు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో అదరగొడతాడు విరాట్ కోహ్లీ. నిలకడకు మారుపేరుగా క్రికెట్ ప్రస్థానాన్ని కొనసాగించిన విరాట్ కోహ్లీ... తన కెరీర్‌లో మొట్టమొదటిసారి గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. 

బ్యాటింగ్‌లో కోహ్లీ రేంజ్ ఇన్నింగ్స్ చూసి చాలా రోజులైంది. భారత జట్టు కెప్టెన్‌గా ఎన్నో అద్వితీయ రికార్డులు నెలకొల్పిన కోహ్లీ, ఐపీఎల్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు విరాట్ కోహ్లీ. కెఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచులు జారవిడిచి... ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు కోహ్లీ నుంచి ‘విరాట్’ రేంజ్ ఇన్నింగ్స్ కావాలి. తనని విమర్శించినవాళ్లకి ఆటతోనే బదులు చెప్పే ‘కింగ్’ కోహ్లీ... మళ్లీ అలాంటి స్ట్రాంగ్ రిప్లైతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

టీ20 కెప్టెన్‌గా 150వ మ్యాచ్ (భారత జట్టుకు 37 టీ20 మ్యాచుల్లో, ఐపీఎల్ 113 మ్యాచుల్లో) ఆడుతున్న విరాట్ కోహ్లీ... 150+ టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన అరుదైన కెప్టన్ల జాబితాలో చేరాడు. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ, డారెన్ సమీ, గౌతమ్ గంభీర్ మాత్రమే 150+ టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?