RCB vs MI: రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు... ఏబీడీ సూపర్ షో... కోహ్లీ మళ్లీ ఫ్లాప్...

Published : Sep 28, 2020, 09:10 PM IST
RCB vs MI: రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు... ఏబీడీ సూపర్ షో... కోహ్లీ మళ్లీ ఫ్లాప్...

సారాంశం

ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలు... 11 బంతులాడి 3 పరుగులే చేసి అవుటైన కింగ్ కోహ్లీ... మరోసారి ఏబీ డివిల్లియర్స్ మెరుపులు...

IPL 2020: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫ్లాప్ షో కంటిన్యూ చేసినా... ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు ‘ఆర్‌సీబీ సేవియర్’ ఏబీ డివిల్లియర్స్ మరోసారి తనదైన ఇన్సింగ్స్ ఆడడంతో మంచి స్కోరు చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

ఆరోన్ ఫించ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేయగా, దేవ్‌దత్ పడిక్కల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం విశేషం. 11 బంతులాడి 3 సింగిల్స్ మాత్రమే తీసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఏబీ డివిల్లియర్స్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో శివమ్ దూబే కూడా బౌండరీల బాదడంతో మంచి స్కోరు చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?