IPL 2020: పూరన్ సరే... సంజూ శాంసన్ ఫీల్డింగ్ సంగతేంటి!

Published : Sep 28, 2020, 07:51 PM IST
IPL 2020: పూరన్ సరే... సంజూ శాంసన్ ఫీల్డింగ్ సంగతేంటి!

సారాంశం

పూరన్ చేసిన ఫీల్డింగ్... తన లైఫ్‌లో చూసిన బెస్ట్ సేవ్ అని చెప్పిన సచిన్ టెండూల్కర్... భారత జట్టులో ఉన్నప్పుడు సంజూ శాంసన్ ఆపిన సిక్సర్ కనబడలేదా? అని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్...

IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందర్నీ ఫిదా చేసేశాడు. సంజూ శాంసన్ కొట్టిన బంతిని, బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ ఆపి... 4 పరుగులను ఆపాడు. ఈ ఫీల్డింగ్‌పైన సచిన్ టెండూల్కర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు అందరూ ‘గ్రేటెస్ట్ ఫీల్డింగ్’ అంటూ ట్వీట్ చేశారు.

నాలుగు దశాబ్దాల క్రికెట్ కెరీర్ కలిగిన సచిన్ టెండూల్కర్ అయితే ఏకంగా... ‘నా జీవితంలో నేను చూసిన బెస్ట్ సేవ్ ఇదే... సింప్లీ ఇంక్రీడబుల్’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇంతకుముందు భారత జట్టుకు ఆడేటప్పుడు సంజూ శాంసన్ చేసిన ఫీల్డింగ్ విన్యాసాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అచ్చు పూరన్ లాగే బౌండరీలోకి ఎగురుతూ బంతిని ఆపాడు సంజూ శాంసన్.

ఐపీఎల్ 10వ సీజన్‌లోనూ మనీశ్ పాండే కొట్టిన సిక్సర్‌ను ఇలాగే ఆపాడు సంజూ. ఆ రెండు మ్యాచుల్లో మన ప్లేయర్ చేసిన ఫీల్డింగ్‌ను ఈ క్రికెట్ దిగ్గజాలు చూడలేదా? అని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... సంజూ శాంసన్ చేసిన ఫీల్డింగ్ విన్యాసాలను కింది వీడియోలో చూడండి. 

 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?