ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్.. ఎవరిదో తెలుసా?

By telugu news teamFirst Published Oct 15, 2020, 12:56 PM IST
Highlights

ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్  ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నోర్జే.

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. ఏ జట్టుకి ఆ జట్టు పోటీపడి మరీ ఆడుతున్నాయి. అయితే.. ఈ ఐపీఎల్ లో క్రికెటర్లు రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా పేసర్ నోర్జే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 

ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్  ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నోర్జే.

బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్జే గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా నోర్జే నిలిచాడు. ఆ మరుసటి బంతికే రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లు వేగవంతమైన బంతులతో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ నోర్జే  చెలరేగిపోయాడు.

ఐపీఎల్‌లో రెండో, మూడో వేగవంతమైన బంతులు బౌలింగ్ చేసిన బౌలర్‌గానూ ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 155.2 కి.మీ/గంటకు, 154.7 కి.మీ/గంటకు వేగంగా బంతులను సంధించి ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బంతులు సంధించి, ఒకే మ్యాచ్‌లో బౌర్ నోర్జే ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నోర్జే 4–0–33–2 గణాంకాలతో రాణించాడు.
 

click me!