RCB vs KKR IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా బెంగళూరులో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు.
RCB vs KKR - Virat Kohli : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ దుమ్మురేపే ఇన్నింగ్స్ తో అదరగొట్టడంతో కింగ్ కోహ్లీ పేరు మారుమోగింది. కోల్ కతా బౌలర్లపై ధనాధన్ బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ 2024 సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. దక్కంచుకున్నాడు. విరాట్ కోహ్లీ తన 83 పరుగులు ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో కోహ్లీ ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు.
Back to back fifties for Virat Kohli 👑
And he’s doing it in front of the home crowd! 🤩 Yes, this is his HOME! 🥹 pic.twitter.com/OsTMljieLf
కాగా, ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీతో మంచి ఆరంభం లభించింది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 83 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కామెరాన్ గ్రీన్ 33, గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 పరుగులు చేశారు.యంగ్ ప్లేయర్ రజత్ పటిదారు (3 పరుగులు), వికెట్ కీపర్ అనుజ్ రావత్ (2 పరుగులు) నిరాశపరిచారు. చివరల్లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. 8 బంతుల్లో 3 సిక్సర్లు బాది 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ధోని అంటే ఆమాత్రం ఉంటది మరి.. మోహిత్ శర్మ